సామాజిక మాధ్యమం – మనం

సామాజిక మాధ్యమం – మనం

సోషల్ మీడియాలొ మెసేజులది ముఖ్య పాత్ర. మనం చూసినవి విన్నవి షేర్ చేస్తూ, మాట్లాడుతూ విజ్ఞానాన్ని పంచుకొంటూ మంచిని పెంచు కోవాలి.

ఎందరో మహానుభావులు నుడివిన మంచి సందేశాలు, ప్రవచనాలు మనం షేర్ చేసుకొంటాం. అవిచూసి గమ్మున ఉండకుండా, ఆకలింపు చేసుకొని, నిత్య జీవితంలో వాటిని అనుసరించి మన అనుభూతులను, అనుభవాలను బంధువులకి స్నేహితులకి షేర్ చేద్దాం!

ప్రపంచాన్ని అద్భుతమైన రీతిలో మన అరచేతిలో, కంటిముందు పెట్టింది, సోషల్ మీడియా, అదే తెలుగులో సామాజిక మాధ్యమం అన్నారు.

టీవీ, ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్స్టగ్రామ్, టెలిగ్రామ్ ఇలాంటివెన్నో ప్రపంచ మేధావులు మన ముందు ఉంచారు. ఎవరి ఇష్టం వారిది. ప్రపంచమంతా మనమే. మన మీడియా బంధువులే. ఎందరో తెలియనివారు, ముఖ పరిచయం కూడ లేనివారు, మన భాష కానివారు కూడ హాయ్!(Hi) అంటారు.

బంధు మిత్ర సకుటుంబ సపరివార సమేతం అంటె ఇదేనేమో. కాని అతి సర్వత్ర వర్జయేత్ కదా!ఏదైనా అతి మతికి సమ్మతి కాదు.

మీడియా పరిచయాలు పెరిగి తోటి మనుషుల కళ్లల్లోకి చూడకుండా సెల్ స్క్రీన్ కో, టీవీ స్క్రీనుకో “సామాజిక దూరం” వంకతో అంకితమైపోయి కంటి డాక్టర్ల కోసం చూడాల్సి వస్తోంది.

కాబట్టి సోషల్ మీడియాలో ఎంతో కొంత పాత్ర వహిద్దాం. “మంచి చేసి చూడు, చెడు ఉంటే వదిలేసి చూడు” అను నానుడితో సంతోషాలలోనే కాక దుఃఖాలలో కూడ స్పందిస్తూ సామాజిక మాధ్యమాన్ని సద్వినియోగ పర్చుకొందాం! ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇద్దాం!

– రమణ బొమ్మకంటి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *