సాధ్యం కానిది సాధ్యం అయింది..
కొన్ని వసంతాల నిరీక్షణ
ప్రపంచం భారత వైపు వీక్షణ
ప్రపంచం మన దేశం వైపు తిరిగిన రోజు
భావితరాలకు గుర్తుండి పోయే రోజు
ఇస్రో శాస్త్రవేత్తల నెరవేరిన కల
చందమామను తాకిన వేళ
చందమామ రావే.. జాబిల్లి రావే… నుండి రావోయి చందమామ.. మా వింత కథ వినుమ..
అని గేయాలు, పాటలు ఎన్ని పాడిన చందమామ రాలేదు..
అందుకే శాస్త్ర వేత్తల కృషితో
విక్రమ్ ను పరిచయం చేసుకున్న చందమామ
జాబిలిని ముద్దాడిన శుభదినం ఇది
ఇస్రో సాధించిన ఘన విజయం వలన చరిత
సృష్టించిన దినమిది
చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించిన రోజు ఇది
భారత జనుల హృదయంలో ఆనందం వెల్లివిరిస్తు
అంబర మాంత సంబరాన్ని నింపి పట్టరాని సంతోషం తో ఉండే రోజు ఇది
జయహో చంద్రయాన్..!
– సాహు సంధ్య