ఋతురాగాలు
ఎన్నో మాటలు ముళ్ళై గుచ్చుకుంటున్నా,
ఏవో ఆటంకాలు రాళ్ళై
అడ్డు తగులుతున్నా,
మౌనమై గూడు కట్టుకున్న
మేఘాలు
కంటినీరుగా వర్షిస్తున్నా,
తీరని గ్రీష్మతాపం స్త్రీ కి
కొత్తేమీ కాదు
అయినా శరత్జోత్స్న
కురిపిస్తూ
ఇంటిని హేమంతంలా కాచే
ఆమె ఆశలు శిశిరాలై
రాలిపోతున్నాయి..
పితృస్వామ్య శాసన లిఖితం
రాజ్యాంగమై శాసిస్తుంటే
తీరని కలల సెజ్జపై పవ్వళించి,
తడారని కన్నులతో
ఆమనికై వేచి చూస్తుంది.
– సలాది భాగ్యలక్ష్మి