ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ

బాహుబలి తర్వాత వస్తున్న రాజమౌళి సినిమా అలాగే తెలుగులో మాస్ ఫాలోయింగ్ బాగా ఉన్న ఇద్దరు టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ దాంతో సినీ అభిమానుల్లో అలాగే సామాన్య జనాల్లో ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి.

ఈరోజు సినిమా రిలీజ్ అయింది బాహుబలి రికార్డ్ లను బద్దలు కొట్టే రేంజులో సినిమా ఉందా లేదా అనేది రివ్యూ లో చూద్దాం

కథ : నిజం చెప్పాలంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మొదలు పెట్టిన జక్కన్న కథ మాత్రం చాలా సింపుల్ గానే తీసుకున్నాడు ఒక గొండ్ల పిల్లను బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లడం.

ఆమె కోసం భీమ్(ఎన్టీఆర్) వెతుక్కుంటూ రావడం మరొక వైపు పెద్ద ఆఫీసర్ గా ప్రమోట్ అవడానికి రామ్(చరణ్) ఎన్టీఆర్ నే పెట్టుకోవాల్సి రావడం అయితే వాళ్ళిద్దరికీ ఒకరి గురించి మరొకరు తెలియకుండా దోస్తీ కుదరడం తెలిశాక ఏం అయింది అన్నదే సినిమా.

విశ్లేషణ : ఎమోషన్ కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే ఇండియన్ సినిమాలో రాజమౌళి తర్వాతే ఎవరైనా అనాలేమో?? ఎందుకంటే తన మొదటి సినిమా నుంచి మొన్నటి బాహుబలి వరకు సినిమాలో ఎమోషన్స్ ను పీక్స్ లో చూపించడం ఆయన ప్రత్యేకత.

స్వతంత్ర పోరాటాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకున్న ఈ సినిమా లో ఆయనకు ఎమోషన్స్ ను ఇంకా అద్భుతంగా చూపించే ఛాన్స్ దొరికింది దాంతో జక్కన్న సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు.

సినిమా ఫస్ట్ సీన్ నుంచి మొదలు పెడితే లాస్ట్ సీన్ వరకూ ఆయన గొప్పతనం అలాగే పనితనం కనిపించాయి… ముఖ్యంగా ఇద్దరి హీరోల మధ్య సమన్వయం చూపిస్తూ బ్యాలన్స్ చేశాడు.

రామ్ అలాగే భీమ్ పాత్రలకు ఒక బ్యాక్ స్టోరీ అందులో ఒక పెయిన్ ఇవ్వడం దగ్గరి నుంచీ ఒకరికి ఒకరు శత్రువుగా మారి ఆ బాధతో వాళ్ళు సంఘర్షణ పడటం అన్నది సినిమాకే హైలైట్ అని చెప్పుకోవచ్చు.

ఒక యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా అద్భుతంగా చూపించారు ఇద్దరి హీరోల ఇంట్రడక్షన్ అవొచ్చు అలాగే ఎన్టీఆర్ పాప కోసం వచ్చినపుడు జరిగే ఫైట్ ఇక చివరకు క్లైమాక్స్ ఫైట్ ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా లవర్స్ కు ఒక విజువల్ వండర్ చూపించారు అనాలి.

రామ్ గా చరణ్ నటన అద్భుతం అసలు తన పాత్రలో భీమ్ కంటే కూడా ఎక్కువ లేయర్స్ ఉండటం వలన నటనకు మంచి ఛాన్స్ దొరికింది దాన్ని నూటికి నూరుశాతం చరణ్ ఉపయోగించుకున్నాడు.

అతని కెరీర్ లోనే ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇక భీమ్ గా నటించిన ఎన్టీఆర్ అయితే తన సెటిల్ యాక్షన్ తోనే అదరగొట్టాడు ముఖ్యంగా రామ్ బ్రిటిష్ పోలీస్ అని తెలిసినప్పుడు సీత రామ్ గురించి చెప్పినప్పుడు అతని నటన ఎందుకు ఎన్టీఆర్ అంత గొప్ప నటుడు అన్న విషయాన్ని మనకు మరొక్కసారి గుర్తు చేస్తుంది.

మిగతా నటీనటుల విషయానికి వస్తే అజయ్ దేవగణ్ అలాగే అలియ భట్, రాహుల్ రామకృష్ణ, శ్రియ అందరూ తమ పాత్రల్లో ఆకట్టుకుంటారు. గోండు పిల్లగా చేసిన అమ్మాయి నటన చాలా బాగుంది.

మిగతా నటులు తమ పరిధుల మేరకు బాగానే నటించారు. బ్రిటిష్ వాళ్ళుగా నటించిన యాక్టర్స్ బాగా చేసారు ముఖ్యంగా ఎన్టీఆర్ ఇష్టపడ్డ అమ్మాయిగా నటించిన బ్రిటిష్ అమ్మాయి బాగా చేసింది.

ఈ సినిమా కు వెన్నెముక అంటే కీరవాణి సంగీతం అని చెప్పాలి ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్ లో ఆయన ఇచ్చిన మ్యూజిక్ రోమాలు నిక్కబొడుచుకునెలా అలాగే కళ్ళు చెమ్మగిల్లెలా కూడా ఉంది.

పాటల్లో నాటు నాటు కుర్చీ లోంచి లేచి డాన్స్ ఆడేలా చేస్తే కొమరం భీముడో పాట గుండెల్ని బరువెక్కించింది. మూవీ విజువల్స్ ఒక ఇంటర్నేషనల్ లెవల్లో ఉన్నాయి.

ఆ క్రెడిట్ సెంథిల్ కుమార్ గారిదే ఇక ఆర్ట్ డైరెక్షన్ ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే విజువల్ వండర్ అనే రేంజ్ లో అనిపించాయి రాజమౌళి సినిమా అంటేనే అద్భుతం కదా…

ఇంత మంచి సినిమాలో అక్కడక్కడా అంటే ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపించడం, సెకండ్ హాఫ్ త్వరగా ముగించిన ఫీల్ కలగడం లాంటి కొన్ని మైనస్ లు ఉన్నప్పటికీ రాజమౌళి ఈ సినిమా లో మనకు ఇచ్చిన ఎక్స్ పీరియన్స్ తో పోలిస్తే ఈజీగా పక్కన పెట్టేయచ్చు.

ప్లస్ పాయింట్స్:
రాజమౌళి దర్శకత్వం
రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటన
కీరవాణి సంగీతం
విజువల్స్
యాక్షన్ ఎపిసోడ్స్
ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ కొంచెం త్వరగా ముగించిన ఫీల్ రావడం

ఫైనల్ థాట్: ఇది రాజమౌళి సినిమా మాటల్లేవ్ మాట్లాడు కోవడాలు లేవు చూసి సెలబ్రేట్ చేసుకోవడమే!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *