రెక్కలు ఉంటే
పక్షులకే రెక్కలు ఉంటాయి.
పక్షులు రెక్కల సహాయంతో
తమ ఆహారాన్ని తేలికగా తెచ్చుకుంటూ ఉంటాయి.
దేవుడు మనిషికి కావాలనే
రెక్కలు ఇవ్వలేదేమో. రెక్కలు
లేకుండానే ఇన్ని అరాచకాలు
జరుగుతున్నాయి. నేరస్తులను
పట్టుకోవటం కష్టం అవుతోంది.
రెక్కలు ఉంటే ఈ మనిషిని
ఎవరూ అదుపులో పెట్టలేరు.
ఈ మాటలు అక్షర సత్యాలు.
రెండు కాళ్ళు ఉన్న మనుషులు
కొంతమంది నాలుగుకాళ్ళ
మృగాలకంటే దారుణంగా
ప్రవర్తిస్తున్నారు. ఇక మనిషికి
రెక్కలు ఉంటే అతను దేవుణ్ణి
కూడా లెక్కచేయడేమో. రెక్కల
గుర్రాల కల్పిత కధలు పెట్టి పూర్వం చాలా సినిమాలే
తీసారు. మనిషిలో ఎగరాలి
అనే కాంక్ష వల్ల అలాంటి కధల
రూపకల్పన జరిగింది. కొన్నాళ్ళకు ఎగిరే యంత్రాలు
అదే విమానాలు కనిపెట్టిన
మనిషి వాటిని అభివృద్ధి పరచి
ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి
అయినా సులువుగా ప్రయాణం
చేయగలుగుతున్నారు. అలా
ప్రయాణించాలంటే కొన్ని షరతులు పాటించాలి కాబట్టి
నేరాలు జరిగేందుకు ఆస్కారం
తక్కువ. అదే ఎవరికి వారికి
రెక్కలుంటే ఊహించటానికే
భయం గొలిపే పరిస్థితులు
వచ్చేస్తాయి.
-వెంకట భాను ప్రసాద్ చలసాని