రెక్కలొచ్చిన ఊహలు
అందమా,
నిను చూసినది మొదలు
నీ ప్రతిమను నిలుప
నిర్విరామ మాయెను నా కృషి.
మసక కమ్మేనా, నా కళ్ళు లేదా
నీవు పొగమంచు మాటునుంటివా ?
ఎట్లు నిలుపగలను నీ ప్రతిమ ?
అర్ధ రాతిరి లేస్తిని.
భయము గొల్పెను నాకు
రెక్కలొచ్చిన నా ఊహలు
ఉండునో, ఎగురునో, నని ?
కలలో గంటిని నిన్ను
కారుమబ్బులు షికార్లు
కొడుతుండగా, ఉరుములు,
మెరుపుల కాంతిలో
చెక్కితిని నీ శిల్పము.
శిల్పి నైతిని అర్ధరాతిరి
నా అనుభవ లేమి
మరిచే ఒక గొడుగు నిల్ప
నీ శిరస్సు పై.
తడిసి ముద్దయితివి ఆరుబయట.
ఓ, నా శిల్పమా,
మన్నించుము ఈ నాటు ప్రేముకుడ్ని.
– వాసు
Chala.. bagundhi..
Style.. suspense and boldness