రావమ్మా వానమ్మ
నీ కోసం ఎదురు చూస్తున్నాం.
నిన్ను రమ్మని స్వాగతిస్తున్నాం.
చలి కాలం వచ్చి పోయింది.
ఎండా కాలం వచ్చిపోతోంది.
రామ్మా, ఇంక నీదే ఆలశ్యం
నీ కోసం ఎదురుచూస్తున్నాం.
నిన్ను రమ్మని స్వాగతిస్తున్నాం.
రైతుల కన్నీరు తుడువగా,
భూమాత దాహం తీర్చగా,
నదులలో నీరు నింపగా
రావమ్మ, వానమ్మ తల్లీ.
స్వాగతం మా బంగారు తల్లీ.
కురిపించు నీ వరాల జల్లు.
వాన జల్లు కురిపించ రావమ్మ.
మనసులో ఆనందం నింపి పోవమ్మా.
-వెంకట భానుప్రసాద్ చలసాని