రాతలు మారాయి

రాతలు మారాయి

బ్రహ్మ రాతను ఎవరూ మార్చలేరు అనే విషయాన్నిచాలా మంది నమ్ముతున్నారు.ఈ భూమి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉద్భవించింది అని పండితులఉవాచ. మనిషి ఐదు లక్షల సంవత్సరాల నుండి మాత్రమేమనుగడలో ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే.

అయితే పది వేల సంవత్సరాలనుండి మాత్రమే మనిషి ఒకసమూహంగా నివసించేవారుఅనేది శాస్త్రవేత్తలు నిరూపించారు. అంతకు ముందు అడవులలో తిరుగుతూ, కొండ గుహలలోఉంటూ, ఆహారం కోసం వేటాడుతూ తమ మనుగడసాగించేవారట.

వారు తమభావాలను అరుపుల ద్వారావ్యక్తపరిచేవారు అని అంటారు.అయితే ఎనిమిది వేల సంవత్సరాల నుండి మాత్రమే మనిషి వ్రాయటం నేర్చుకున్నారుఅని నిరూపితమైనది.

అంతకుముందు మానవుడు తన అరుపుల ద్వారా, సంజ్ఞలద్వారా తన భావాలను ఇతరులకు తెలియజేసేవారు.
ఆ తర్వాత రాళ్ళపై రకరకాలబొమ్మలు వేసి తన భావాలనువ్యక్తపరిచేవారు.

మనిషి యొక్క భావ ప్రకటనకు భాష ఎంతో ముఖ్యమైన భూమికపోషిస్తుంది. మన తెలుగు భాష కూడా ప్రాచీనమైనదే అని నిరూపితం అయ్యింది. తెలుగు భాష ప్రాచీనత 2,400 సంవత్సరాల నాటిదని భాషా పండితులు కనుగొన్నారు.

పూర్వ శాసనాలు పరిశీలిస్తేఅప్పటి తెలుగువారుతెలుగు భాషను గొలుసుకట్టుపద్ధతిలో వ్రాసినట్లు కనుబడుతోంది. అందు‌‌లోనికొన్ని అక్షరాలు ఇప్పుడు మాయమైపోయాయి.

నేటి తరానికి తెలుగు భాషనువ్రాయటం,చదవటం తెలియటం లేదు. వారికితెలుగు భాష గొప్పదనంతెలియచేసి చక్కగా చదివేలాగా,వ్రాసేలాగావారి పెద్దలే తర్ఫీదు ఇవ్వాలి.అది పెద్దల బాధ్యత.

-వెంకట భానుప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *