రంగుల విషాద కేళీ

రంగుల విషాద కేళీ

 

పూరి ముక్క కోసం ఆశపడిన నువ్వు
అది దొరికిందని సంతోషం లో మృగాలు
మత్తు లో ఉండే చోటుకు తెలియకుండానే
ఆడుకోవడానికి అక్కతో కలిసి వెళ్ళావు
అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఆ
నలుగురు, ఉచ్ఛం , నీచం మరిచి, పసిది
అనికూడా చూడకుండా పళ్ళతో కొరికి,
దవడ ఉడోచ్చేలా రక్కుతూ, ఎక్కడ పడితే
అక్కడ గిల్లుతూ గిచ్చుతూ తన పశువాంఛ కు
నిన్ను బలి చేశాడా, అయ్యో తల్లి ఎంత నరకం
అనుభవించి ఉంటావో కదా, ఏన్ని సార్లు అమ్మా
అమ్మా అంటూ దిక్కులన్నీ పిక్కటిల్లేలా అరిచినా
నీకోసం ఎవరూ రాలేదంటే వారెంత కర్కషులో
ఏముందమ్మ నీ చిన్ని ప్రాణం లో కండ, ఏముందని
వెనక నుండి,ముందు నుండి నిన్ను నాశనం చేశారు
మాటలే రాని నిన్ను మానవ మృగాలు నలుపుతుంటే
ఇంకొకడు మీ అక్కను నాశనం చెయ్యబోతూన్న క్షణం లో
ఆ మృగాన్ని తప్పించుకుని బయటకు వచ్చి చెప్పినప్పుడు
ఆ తల్లిదండ్రుల వేదన ఎంత నరకం,ఎంత అవమానం ,
ఆ నలుగురు తప్పించుకుని వెళ్ళిపోయాక ఇప్పటికీ నువ్వు
బ్రతికావు అది చాలు,కానీ ఆ సంఘటన నీలో ఎంత అలజడి
భయం,కోపం ,ద్వేషం రేపిందో,మనసు ఎంత అల్లకల్లోలం అయ్యిందో, మనుషులా వాళ్ళు, రాక్షసులు కూడా కాస్త
కనికరం చూపుతారు. కానీ వీరు రాక్షసుల కన్నా ఎక్కువ
మనిషిని మనిషి పిక్కుని తింటుంటే చుట్టూ ఉన్న సమాజం
చోద్యం చూస్తోంది తల్లి, రంగుల పండుగ నీకు నల్లని రంగుని
పులిమింది.నీ జీవితం అంధకారమయ్యియంది.

ఇక జీవితం లో మగాడు అంటే భయపడేలా చేసింది. నీ చిన్ని ప్రాణం ఎంత క్షోభ అనుభవించి ఉంటుందో,

కానీ రాక్షస సంహారం
జరగాల్సిందే, వారికి శిక్ష పడాల్సిందే , వారికి కూడా నీలాగే
కొరికి కొరికి చంపాల్సిందే , వస్తుందమ్మ ,ఆక్షణం ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది.

రాక్షస సంహారం జరిగి తీరుతుంది. నీ కన్నీళ్లకు ,నువ్వు అనుభవించిన నరకానికి వారు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరతారు.

(బీహార్లో నిజంగా జరిగిన సంఘటన తీసుకుని రాయడం జరిగింది ).

 

– భవ్యచారు
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *