రంగుల ప్రపంచం
సినిమా
రంగు రంగుల ప్రపంచం,
మాకు ఈ రంగులే ప్రపంచం
ఊహలోకం,మాయాజాలం,
అందరికీ అర్ధంకాని ఇంద్రజాలం.
మేమంటే అందరికీ లోకువే,
ఇక్కడ ఎదో ఒకటి సాధించేదాకా ఎవ్వరూ లేని ఒంటరివే.
ఏం చెయ్యలేక ఇది చేస్తున్నాడు అంటారు,
మాది గమ్యం లేని జీవితమంటారు.
కానీ మాకు కూడా కొన్ని కలలు ఉన్నాయి,
మా కళతో ఆ కలలు నెరవేర్చటానికి మా ఈ కష్టం మొత్తం.
కడుపు నిండకపోయినా,
నిద్ర లేకపోయినా,
సహకారం లేకపోయినా,
నాకున్న కల కోసం కష్టపడి,
ఆ కలకి నా కళతో ప్రాణం పోయాలి అనేది నా లక్ష్యం.
సినిమాలో అంత డబ్బు ఏం రాదు,
మర్యాద ఇవ్వరు.
స్వేచ్ఛ కూడా ఉండదు.
ఇంత కష్టపడి సినిమా తీసినా,
పైరసీ అనే భూతం వల్ల నష్టం కూడా వస్తుంది.
కానీ మేము సినిమాను వదలం.
చెప్పానుగా,
ఇది అందరికీ అర్ధంకాని ఇంద్రజాలం.
విన్నపం:- దయచేసి పైరసీ సినిమాలు చూడకండి.
ఇష్టం ఉంటే థియోటర్ కి వెళ్లి చూడండి,
లేదా సినిమా సామాజిక ott కి వచ్చే వరకు వేచి ఉండండి.
సినిమా వెనుక కొన్ని లక్షలమంది కష్టం ఉంది.
-ఈగ చైతన్య కుమార్