రంజాన్ మాసం
సమస్త జనుల కొరకు
అల్లా దివి నుండి భువికి
దైవ ప్రవక్త ముహమ్మద్
సొల్లాలహు అలైహి వసల్లం
ద్వారా దివ్య ఖురాన్ ఇచ్చింది
పవిత్ర చంద్రమాసం రంజాన్లో
రంజాన్ మాసం వరాల మాసం
ఆకాశానా నెలవంకను చూచీ
ముస్లిం సోదర సోదరీమణులు
ప్రవక్తపై దరూద్ దువా పఠించీ
రంజాన్ చాంద్ ముబారక్
శుభాకాంక్షల సందడి జేసీ
తరావీల నమాజు చదివి
నెలంతా సెహరీ ఇఫ్తార్లతో
కఠిన ఉపవాస దీక్షలతో
కామ క్రోధ లోభ మోహ
మద మాత్సర్యములను
జయించుటకు ప్రయత్నిస్తారు
శేష జీవితం సన్మార్గన
మనోవాంఛలను నియంత్రిస్తూ
జీవించుటకు ప్రతిని బూనీ
తమ సంవత్సరాదాయంలో
జకాత్ సొమ్ము బీదలకు దానం చేసీ
మాసాంతాన ఆకాశాలో
రంజాన్ చంద్రుని దర్శించి
పవిత్ర రంజాన్ రోజాలు ముగిస్తారు
నిరుపేదలు సంతోషంగా పండుగ జరుపుకోవాలనీ
కుటుంబలోని ప్రతివ్యక్తి”ఫిత్రా” దానం తప్పక జేసీ
అల్లా నుండి రంజాన్ పండుగ రోజున
నెలరోజుల రోజాఫలం పొందుటకు
“అల్లా హూ అక్బర్ “అంటూ
పిల్లలు పెద్దలు నూతన వస్త్రాలు ధరించి
ఈద్గలలో సమస్త మానవాళి కొరకు ప్రార్థన చేసీ,
బంధుమిత్రులతో ఒకరినొకరు ఆలింగనంచేసుకొని
రంజాన్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సందడిచేస్తారు
ఇంటిల్లిపాది సంతోష సంబరాలతో గడుపుతూ…
సేమీయాల పాయసం బిర్యానీల వంటకాలతో
ముస్లిం సోదరులు హిందూ క్రిష్టియన్ స్నేహితులు సోదరులను పండుగ రోజున ఇంటికి ఆహ్వానించీ
విందు భోజనం వడ్డించీ అందరూ కలిసి విందారగిస్తారు.
-గురువర్ధన్ రెడ్డి