రావణ సంహారం
దశరథ నందన శ్రీ రామ నీ జననంతో అయింది అయ్యోధ్య అందాల నగరం
అయోధ్యా నగరిలో ఈ దినాన పులకించింది ప్రజల హృదయ ఆనందం
ముగ్గురు మాతల ముద్దుల రాముడవు
అయోధ్య ప్రజలకి శ్రీరామ ప్రభూవు
నీ పాద స్పర్శతో శిల నుంచి అహల్య మాతను మనిషిగా మార్చినవు
ఋషులను హింసిస్తున్న తాటకి పీడను పోగొట్టావు
గురువు ఆజ్ఞతో శివధనస్నుసు విరిచినావు
జానకి తో వివాహమాడి జానకి రాముడివి అయ్యావు
తండ్రి మాటను జవదాటని పుత్రుడిగా మహాపురుషుడయ్యావు
కైకేయి మాత కోరికలను తీర్చావు
హనుమంతుడు వంటి గొప్ప భక్తుడిని పొందావు
స్నేహం కోసం కిష్కింధ నగర రాజును చంపి సుగ్రీవుని రాజును చేశావు
సీతమ్మ కోసం కన్నీళ్ళతో,కష్టాలతో యుద్ధం చేశావు
రావణ సంహారం చేసి విభీషుణున్ని రాజుని చేశావు
అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపించావు
ధర్మానికి ప్రతిరూపము నీవు
ధర్మా మార్గాన్ని ఆచరించి మహాయోగి అయ్యావు
-సాహు సంధ్య