రాకాసి పురుగుల పంట
కలకాదురా శివా….
గుండె చెరువాయెరా శివా…
చూడబోదామంటే చూపులకు దొరకదు
పిలువబోదామంటే బంధువసలే కాదు
ఇది కనివిని ఎరుగలేమురా మెదడుకు
పెద్ద మేకాయరా…
రాగధ్వేషాలు లేని రాకాసి పురుగంట
కిరిటాల రూపమై రాజ్యమేలే నంటా..
చూపుల కంటినా నలుసంతటీ బతుకులను
గూడు కట్టనా కొలుకుళ్ళో పీసులుగా
తోడేనురా…
ఊరూరునా తిరుగుతు పేరు పేరునా
పలకరిస్తు…ఇంటింటికి భోనమై వస్తుందిరా
ఉనికి మరిచి నీవు ఉండొద్దురా…
జాగుచేసిన బతుకుతో జాతి మొత్తంగ
ఆగమై పోవద్దురా…
గగనాన చంద్రున్ని గంటలో చూపిస్తాడు
పాతాళ గంగను రెప్పపాటున పైకెత్తి
పోస్తాడు…ఆ చుక్కలా పర్వతాన్ని చిటికెలో
తిరిగొస్తాడు…
ఆధునిక పేరుతో అంతులే గొలిచాడు
రానున్న ఉపద్రువాన్ని గమనించడం
మరిచాడు…మనుషుల్లో దాగినా
మానవత్వం పై బురద జల్లేస్తాడు…
ఏమని అడిగితే కన్నెర్ర జేస్తాడు…
ఎవరికి ఎవరు కాదురా ఎంత కాలమీగోడురా…
మనుషుల్లో దేవుడు మచ్చుకైనా లేక…
బంధాలు తెగిన అంధకారాన్ని దేహానికి
కట్టుకొని గుదిబండలా బతుకు నీడ్చేను…
మానవజాతి ఇంట పందెమై పండేను
పాప పుణ్యాలను వడబోయుటకు…
ప్రళయకాలపు రుద్రమైనా రాకాసి పురుగుల
పంట రణరంగమై…
పెంచుకొన్న మమతాను రాగాలతో
ప్రేమతత్త్వం పంచినా మానవీయతా
దర్శణాలు ఎంతటివోనని…
తెలుసుకొనేటందుకు దూతలను పంపిన
యమధర్మమై వచ్చేనురా…
-దేరంగుల భైరవ
Bagundhi 👌👌👌👌👌🙏🙏