రైతు గొప్పతనం

రైతు గొప్పతనం

ఎండనకా వననకా చలి అనకా… రెక్కలు ముక్కలు చేసుకొని డొక్కలు చింపుకొని…
తన కడుపు మాడుతున్నా.. ఆగకుండా శ్రమించే కష్ట జీవి…
తన కుటుంబం కోసం వ్యవసాయాన్ని నమ్ముకుని..
సాయం చేసే వారు లేక…
వస్తారు అనే నమ్మకాన్ని చంపుకోలేక ఎదురు చూస్తున్నారు..

వరుణుడు కరుణించి, వర్షం కురిపించి, కళ్ళలో ఆనందాన్ని నింపుతాడు అని చూసి చూసి కళ్లు కన్నీరు అయి అలసిన మనసుతో ఆశ చావక…
తన బిడ్డల కడుపు నింపడం కోసం.. దేశం ఆకలి తీర్చడం కోసం నిత్యం శ్రమించే రైతు..
పంటలు పండక కుటుంబ భారం పెరుగుతున్నా..

వయసు భారం పెరుగుతున్నా… కళ్ళు మూసుకున్నా.. రెక్కలు లేవకున్నా..

తన బిడ్డల కోసం ప్రాణం పోతున్న లెక్కచేయకుండా… నిరంతరం శ్రమిస్తూ…

శ్రమకు ఫలితం దక్కక ఆలి తాళిని తాకట్టు పెట్టినా… అప్పుల భారం పెరుగుతున్న ఓర్చుకుని అన్ని భరిస్తూ…

తన ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు నడుస్తూ… రేపటి కోసం ఆశతో ఎదురు చూస్తూ శ్రమించేది రైతు…

అలాంటి రైతు గోడు పట్టించుకునే నాధుడు లేడు..
ఎవడో వస్తాడు ఎదొ చేస్తాడు.. ఇక నైనా పంట చేతికి వస్తుందనే ఆశతో..

ఉండే రైతు అది తీరదు అని తెలుసుకొని ఉరి కొయ్యకు వేలాడుతున్నడు….
అందరికీ ఇలాంటి పరిస్థితి వస్తే పంట పండించే నాధుడు ఉండడు..

పండించే రైతు లేకుంటే, ప్రతి మనిషి పరిస్తితి ఏమిటి? ఎం తింటాం? ఎలా బతుకుతాం?
ఆలోచించండి… ఆదుకొని.. రైతుని ముందుకు నడిపిస్తారు అని కోరుకుంటున్నాం..
అందరి కడుపు నింపే గొప్ప వ్యక్తి రైతు… అలాంటి రైతుల కడుపు కొట్టకండి….

– వనీతా రెడ్డీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *