రైతు గొప్పదనం
“నా దగ్గర ఈ డబ్బే ఉంది మిగతాది నా పంట పండిన తర్వాత కడతాను” అని రిక్వెస్ట్ గా అడుగుతాడు బ్యాంక్ మేనేజర్ ని రైతు.
“లోన్ తీసుకున్నప్పుడు లేని బాధ బ్యాంక్ కి ఎందుకు తక్కువ సమయంలో కట్టకపోతున్నారు” అని కోపంగా అడుగుతాడు.
“ఈ ఏడాది పంటలు బాగా దెబ్బతిన్నాయి. అందుకే టైంకి డబ్బులు కట్టలేకపోయను” అని చెప్పాడు రైతు.
“ఎందుకు ఋణం తీసుకొని పంట పండిస్తున్నారు. ప్రపంచం మారుతుంది. మీరు ఎప్పుడు మారతారు” అని చులకన భావంతో మాట్లాడతాడు.
“మీ వల్లే దేశానికి చెడ్డ పేరు వస్తుంది అని ఇంకా ఎన్నో మాటలు మాట్లాడాడు.”
అప్పుడే మేనేజర్ పై ఆఫీసర్ వచ్చి
“మీరు చేస్తుంది ఏమైనా న్యాయంగా ఉందా?” అని అడిగారు మేడం.
కొంచం కంగారుగా తడపడుతూ
“అది మేడం పంట పండించడం కోసం మా బ్యాంక్ లో ఋణం తీసుకున్నారు. కానీ ఇప్పటివరకు ఒకసారైనా ఋణం తీర్చలేదు” అని చెప్పాడు మేనేజర్.
“ఈ ఏడాది పంట దిగుబడి లేకపోవడం వల్ల సరైన సమయంలో డబ్బులు కట్టలేకపోయాను అమ్మ. నా కూతురు ఉంటే తానే తప్పకుండా కట్టేసింది” అని బాధతో చెప్పాడు రైతు.
“నేను ఇప్పుడే మీ అమ్మాయితో మాట్లాడ్డాను” అని చెప్పింది పై ఆఫీసర్ మేడం.
“ఇప్పుడు ఋణం తీర్చడానికి వచ్చి కూడా మీ మేనేజర్ కట్టించుకోవడం లేదు” కన్నీళ్లు పెట్టుకొని చెప్పుతున్నాడు రైతు.
అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఈ విషయం ఆ మేనేజర్ కి అర్దం కావడం లేదు. ఆ మేడం కి ఫోన్ వస్తుంది. అది వెంటనే లిఫ్ట్ చేసి మాట్లాడి కట్ చేసింది.
“మీ ఋణం ప్రతి నెల మీ అమ్మాయి బ్యాంక్ కి కట్టేస్తారు” అని చెప్పింది మేడం.
“చాలా సంతోషం అమ్మ. ఇంకా నేను వెళ్లుస్తాను” అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు రైతు.
ఆ మేడం ఆఫీస్ టైం అయిపోవడం వల్ల తను కూడా బయటకు వెళ్లి ఆ రైతుని కారులో ఎక్కించుకోవ ఆ మేనేజర్ చూసి ప్యూన్ ని పిలిచి
“మా మేడం కి ఆ రైతుకి ఏం సంబంధం ఉంది” అని అడిగాడు.
“ఆయన గారే మా మేడం తండ్రి గారు. మీరు కొత్తగా వచ్చారు కానీ ఈ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు” అని చెప్పాడు ప్యూన్.
భయంతో “ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు” అని కోపంతో అడిగాడు మేనేజర్.
“మీకు చెప్పేలోపు మేడం వచ్చి నాకు అడ్డు పడి ఆపారు” అని చెప్పాడు ప్యూన్.
“ఆ విషయం తెలియక నేను ఆయన్ని ఎన్నో మాటలు అన్నాను “అని మేనేజర్ చెప్పాడు.
మరసటి రోజు మేనేజర్ వచ్చి
“నన్ను క్షమించండి మేడం. మీ నాన్న గారు అని తెలియక తప్పుగా మాట్లాడను” అని చెప్పాడు.
“ఈ ప్రపంచం ఇలా బ్రతుకుతుంది అంటే దానికి కారణం ఇద్దరే ఉన్నారు. వాళ్ళలో ఒకళ్ళు రైతు మనం అన్నం తింటున్నాము అంటే ఆయన పండించిందే. రెండవది బార్డర్లో మన ప్రాణాలకు రక్షణ ఉన్న జవాన్లు వాళ్ళని గౌరవించాలి. అది గుర్తు పెట్టుకో అని కోపంతో చెప్పింది మేడం. “రైతు ఎప్పుడు గొప్పవాడే అది తెలుసుకో.”
“ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను” మేడం అని వెళ్ళిపోయాడు మేనేజర్.
రైతులను చులకనగా చూడటం మానుకోండి. జై కిసాన్.
- మాధవి కాళ్ల