రైతు గొప్పతనం

రైతు గొప్పతనం

తనకంటూ ఏమి మిగల్చకుండా
ఉన్నదంతా భూమి తల్లిని నమ్ముకుని
భూ తల్లే తనని కాపాడుతుందని నమ్ముకుని
పంట వేస్తాడు రైతు, ఎండనక, వానానక ఆ
భూమి లో ఉన్న పంటను కంటికి రెప్పలా
కాపడుకుంటాడు. ఎన్నో మందులు వేస్తూ,
కలుపు తీస్తూ, కన్నబిడ్డలా చూసుకుంటాడు అదే సమయంలో

వాన దేవుడికి కోపం వచ్చి పొట్టకొన్నచ్చిన పంటను పాడు చేసినా

ఆదరక, బెదరక ఉన్నదాన్ని కాపాడుతూ తాను ధైర్యంగా ఉంటూ నలుగురికి ధైర్యం చెప్తూ,

ఆ కాస్త పంటను మిల్లుకు తీసుకుని వెళ్తాడు.
అక్కడ తన వంతు వచ్చేవరకు చలిలో మగ్గుతూ, ఓ పూట
తిని, ఓ పూట తినక , ఒప్పిగ్గా ఎదురుచూస్తారు.

తనవంతు రాగానే పంటను మిల్లులో సగం రేటు కైనా అమ్మేసి తిరుగు ప్రయాణం అవుతాడు.

ఆ మిగిలిన డబ్బుతో పస్తులు ఉన్నా
చేసిన అప్పు తీర్చేసి, మళ్లీ ఆశగా భూ మాతను నమ్ముకుని
మళ్లీ పంటను వేస్తాడు. మళ్లీ ఆశగా నింగి వైపు చూస్తాడు
వరుణ దేవుడు కరుణించక పోతాడా అంటూ..
పంటను సగం మింగేసినా, దేవుడు కరుణించక పోయినా
విత్తనాలు అమ్మేవాడు మోసం చేసినా, కమిషన్ కోసం దళారులు సగం రొక్కం లాక్కున్నా,

నకిలీ విత్తనాలు వల్ల పంట రాకపోయినా, పురుగుల మందులు నకిలీ అని తెలిసినా,

తను కడుపు నిండా తిన్నా, తినకపోయినా, పస్తులున్నా, పిల్లలకు పట్టెడు అన్నం పెట్టకున్నా,

చినిగిన బట్టలు వేసుకున్నా, అప్పుల వాళ్ళు గోస పెడుతున్నా, ప్రభుత్వాలు ఆదుకోక పోయినా, నా నేలతల్లి అంటూ
ఆ నేల తల్లిని నమ్ముకుని మన కడుపు నింపుతున్న ఆ రైతు గొప్పదనం అమ్మకన్నా గొప్పది.

అమ్మ ఒక్కసారి కంటుంది. కానీ రైతు పంటను వేసిన ప్రతిసారి నొప్పులు తీస్తూనే ఉంటాడు, నరకం చూస్తూనే ఉంటాడు.

అయినా తన వ్యక్తిత్వాన్ని నమ్ముకుని నేను రైతుని అంటూ గొప్పగా చెప్పుకుంటారు.

రైతు దేశానికి వెన్నెముక అని ఉపన్యాసాలు ఇచ్చిన నాయకులు మాత్రం ఆ రైతును మాత్రం పక్కకు పెడతారు.

ఏన్ని అవమానాలు, అనుమానాలు, ఏన్ని మోసాలు జరిగినా రైతు మాత్రం తన పని ఆపుకొడు.

తన పని తాను చేస్తూ వెళ్తూనే ఉంటాడు. ఎప్పటికైనా, ఇప్పటికైనా రైతే రాజు.

ప్రతి మెతుకు మీద మన పెరున్నట్టే, ప్రతి గింజ మీద రైతు తన చెమట చుక్కాని చిందిస్తాడు.

తనను ఎవరూ కాపడకపోయినా అతను మాత్రం దేశాన్ని కాపాడతాడు.

మనకు అన్నం పెట్టే రైతన్న ఋణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. వారికి ఇవే మా అక్షర నీరాజనాలు. జై కిసాన్.

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *