రైతే …రాజా..!?
విప్లవం ..విప్లవం..పెను విప్లవం..
అనంత మార్పులతో..
విశ్వమంతా వ్యాపించిన..
హరిత విప్లవం..!
నైసర్గిక స్వరూపాలే..సహజత్వాన్ని..
కోల్పోయిన వైనం..!
హరిత విప్లవం.. హరిత విప్లవం..అంటూ..
హేలీనాదం చేసిన శాస్త్రవేత్తలే ..
అనుభవాల సమీకరణ లో..
సేంద్రియ వ్యవసాయమే ….
మేలంటున్న … వైనం..!
సన్నకారు , చిన్నకారు రైతులు..
కాయకష్టం చేసే కూలీలుగా..
మారిన… ధైన్యం..!
పట్టడన్నం.. పెట్టె
అన్నదాతను రుణ సంకెళ్లలో
బంధించిన హీనం..!
ప్రకృతే.. స్పందించి వర్షిస్తే..
అతివృష్టి.. అనావృష్టి..ఆనక..
అప్పు చేసి పుడమి పై పెడితే.
గుప్పెడు గింజలను ….
గింజుకొని ఇచ్చే ప్రకృత్రి..!
అన్నీ ఒడ్డుకొని పండిస్తే..
గిట్టుకొని గిట్టుబాటు ధరలు…!
శాస్త్రం..పరిజ్ఞానం..
పరికరాలు..పరిశీలనలు..అన్నీ
నేటి రైతు స్థితిని …
కాపాడుకోలేని ..నిర్ధేశం..!
మట్టిలో పుట్టి .మట్టిలో పెరిగి..
తుదకు మట్టిలోనే కలిసిపోయే..
బలవన్మరణాలు..!
రైతన్న నిత్య జీవనం..
చావు , బ్రతకుల…
మధ్య సంఘర్షణల
కన్నీటి సుడిగుండం లో..
కొట్టుకుపోతున్న..శోకం..!
అన్నం పెట్టే రైతన్న కే..
పెట్టెడన్నం కరువైన…కడుపుమంటలో..
ఎలాంటి సహకారం లేని గుండెమంటల్లో..
కనపడలేదా మనజాతి భవిష్యత్తు..!
భవితలో మన గురించి మనం..
ఏమీ చెప్పుకోలేని విపత్తు..!
మరు భూమి ముద్దు బిడ్డ ..రైతన్న..!?
లేక అన్నపూర్ణ దేశానికి…ముద్దుబిడ్డా!?
భావి భారత జీవితానికి..జీవనానికి..
వెన్నెముక అయిన..
రైతును ఆదుకోవాల్సిన తరుణం..!
లేదంటే..!!
అన్నపూర్ణ నాదేశం అంటూ…
చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన సమయం..!!!🙏
-గురువర్థన్ రెడ్డి