రాధా మాధవ
రాధా మాధవ, రాధ కృష్ణ అంటూ రకరకాల పేర్లతో పిలుస్తాం అయితే అసలు ఈ రాధ మాధవుల బంధం ఇలాంటిది అనే ఆధారాలు ఏవీ లేవు. కొంతమంది, రాధా మాధవులు ప్రేమించుకున్నారని కానీ వయసు తేడా వల్ల పెళ్లి చేసుకోలేకపోయారని అంటారు.
మరికొందరు, రాధా కృష్ణుని భక్తిలో మునిగిపోయి అతని నామస్మరణ చేస్తూ అతన్నే ధ్యానిస్తూ ఒక భక్తురాలిగా మారిపోయిందని అంటారు. ఇంతకీ రాధ కృష్ణుడిని ప్రేమించిందా? కృష్ణుని పెళ్లి చేసుకోవాలనుకుందా? కృష్ణుడు కూడా రాధను ఇష్టపడ్డారా? కృష్ణుడు రాధని పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? రాధతో కలిపి కృష్ణుడికి 16,000 మంది భార్యలు అన్నది ఎంతవరకు నిజం?
వరుసకు మేనత్త అయిన రాధను కృష్ణుడు ప్రేమించడంలో నిజముందా? ఇవన్నీ ప్రశ్నలే ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరికి తెలియవు. నాకు కూడా తెలియవు. మరి ఈ రాధా మాధవుల మాధవుల బంధం ఎలాంటిది మనం తెలుసుకోవాలని అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే నాకు తెలిసినంతలో రాధ కృష్ణుడిని ప్రేమించలేదు అతనిలో ఉన్న కలని ప్రేమించింది.
అవును మీరు వింటున్నది నిజమే అతనిలో ఉన్న వేణునాధ కలని ఆమె ప్రేమించింది. కృష్ణుడు వేణువు వాయించే విధం విధానం ఆ సంగీతానికి అనుగుణంగా తన మనసును మలుచుకొని ఆ ధ్యానంలో ఆ సంగీతానికి మైమరిచిపోయి వేణువు వాయిస్తున్న అతన్ని కూడా ఇష్టపడడం మొదలుపెట్టింది.
పని చేసుకుంటున్నా ఆడవాళ్లు పాటలు పాడుకుంటూ, తాము చేసే పనిని కష్టం లేకుండా శ్రమ అనేది తెలియకుండా ఎలా మరచిపోతారో అలాగే రాధ కూడా తాను చేస్తున్న పనులను మర్చిపోవడానికి కృష్ణుని సంగీ కృష్ణుడు వాహించే వేణు నాదానికి బానిసగా మారి ఆ సంగీతం ఏంటో తన పనులు తాను చేసుకుంటూ మైమర్చిపోయేది.
అలా రాధ కృష్ణున్ని ఇష్టపడడం మొదలుపెట్టింది. నిజానికి ఆమె ఇష్టపడింది కేవలం సంగీతాన్ని మాత్రమే, అందుకే ఆమెను భక్తురాలుగా చాలామంది అంటారు. కృష్ణుని మేనత్తయిన కృష్ణుని కన్నా వయసులో పెద్దవిడ ఆయన శ్రీకృష్ణుడు ఆమెని తోటి స్నేహితురాలి గానే చూశాడు తప్ప ఆమెను ప్రేమించలేదు.
ఎందుకంటే కృష్ణుడు దైవ స్వరూపుడు తనకి ఎప్పుడూ ఏం చేయాలో ఎప్పుడు ఎవరికి మోక్షం ప్రసాదించాలో తెలిసినవాడు కాబట్టి రాధను తన భక్తురాలి గానే లేదా తన స్నేహితురాలిగాను చూశాడు కాబట్టి అక్కడ వారికి పెద్ద సమస్య కాలేదు. కృష్ణుడు తర్వాత ఎంతమందిని పెళ్లి చేసుకున్నా కూడా రాధ అతన్ని ఏమాత్రం ఆపలేదు ఆపడానికి ప్రయత్నం కూడా చేసినట్టుగా చరిత్రలో లేదు.
కృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నారు. అయినా కృష్ణుడు వారెవరిని పెళ్లి చేసుకోలేదు అతనికి భార్యలు ఎనిమిది మంది మాత్రమే. ఏదైనా చరిత్రను అనుసరించి 8 మంది మాత్రమే మనకు కనిపిస్తారు మిగిలిన వారంతా తన బాల్య స్నేహితులుగానే కృష్ణుడు అనుకున్నాడు తప్ప వారు ఎవరిని శ్రీకృష్ణుడు ఇష్టపడలేదు.
కృష్ణుడు చిన్ననాటి నుండి తన మహత్యాన్ని చూపించడం వల్ల అందరూ తమ సమస్యల నుంచి అతను కాపాడుతున్నాడు కాబట్టి అతన్ని దేవుడిగా భావించి అతని నామస్మరణ చేశారు. నిజానికి మహావిష్ణువుతారమే శ్రీకృష్ణుడు. లోక కళ్యాణం కోసం ఈ జన్మ ఎత్తాడు కాబట్టి నిందలు భరించాడు.
అలాగే ప్రేమించిన వారిని అలరించాడు. కష్టాలలో కృష్ణ అనగానే ఆదుకున్నాడు. మరి రాధాకృష్ణులు రాధా మాధవులు అని ఎందుకంటారు అంటే వయసులో ఉన్న ఎవరైనా స్నేహం చేస్తారు కానీ తనకన్నా పెద్దవారితోను తనకన్నా చిన్నవారితోను ఎవరు స్నేహం చేయరు. కృష్ణుడు మాత్రం అలా కాకుండా తనకన్నా వయసులో పెద్దయిన తన మేనత్త అయిన రాధతో స్నేహం చేశాడు.
ఆ స్నేహబలం వల్ల రాధా మాధవులుగా చలామణి అవుతున్నారు. రాధా కృష్ణుని వేణునాదానికి అతనిలోని సంగీత తృష్ణ ను తాను చేయాలనుకున్న పనిని అతను చేస్తున్నాడు కాబట్టి అతనితో స్నేహం చేసింది. స్నేహం ఎలాంటిదో అలాగే రాధతో స్నేహం కూడా అలాంటిదే అని కృష్ణుని మనోగతం అనుకోవచ్చు.
రాధా శరణం మహిమ అనిపించడానికి కృష్ణుడు ఆమె అడిగినప్పుడల్లా వేణువు వాయిస్తూ తన స్నేహాన్ని పెంపొందించాడు అందుకే స్నేహానికి గుర్తుగా రాధా మాధవులను అనుకోవచ్చు. ఇది మనం పసుపుష్టంగా భాగవతంలో లేదా శ్రీకృష్ణుని కథలలో ద్వారా మనం గ్రహించవచ్చు.
శ్రీకృష్ణుని మనోగతం ఏదైనా రాధా మాధవులు అనే పేరు చిరస్మరణీయంగా చరిత్రలో నిలిచిపోవడానికి కారణమైంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ఎవరిని కించపరచడానికి లేదా ఎవరి భావాలను ఉద్దేశించి రాసింది కాదు.
– భవ్యచారు