ప్రియురాలు
రాలు కన్నుల నీరే ధారగ
ప్రియురాలు వన్నెల తీరే చూడగ
వరాలు యిచ్చెను నవ్వే నవ్వగ
తరాలు తరిగెను నిను తలవగ
చెవి దుద్దులు కావవి, చెంపకు హద్దులు..
ముక్కు పుడక కాదది, నా శ్వాసకు అమరిక..
మమతను పంచే ఆ రూపు, తమకము పెంచి ఆశ రేపు..
తమకొరకేనంటూ ఆమె చూపు,
మననము చేయగ హాయి గొలుపు
ఆవె ఆమె నవ్వు లోన ఆమనీ రాగాలు
పలుకుచుండె చూడు పలకరించి
ఆమె నొసటి పైన ఆదిత్యుడమరగా
పులకరించె తనువు పడతిని గని
– సత్య సాయి బృందావని