ప్రియమైన నీకు పనిలేని నేను వ్రాయునది

ప్రియమైన నీకు పనిలేని నేను వ్రాయునది 

 

నీకు చాల రోజులుగా ఒకటి చెప్పాలని మనసులో ఒకటే పోరు ….కానీ చెప్పటానికి వచ్చిన ప్రతిసారీ నువ్వు లారీ హెడ్లైట్లంత కళ్లేసుకొని చూసేసరికి నాకు చలి జ్వరం వచ్చేది . అందుకే ఎప్పుడు అంత దైర్యం చేయలేదు ఫోన్ నంబర్ కనుక్కొని ఫోన్ చేద్దాం అంటే మా దొడ్లో బర్రె అరిచినట్టు ఆ గొంతేసుకొని అరిస్తె నా చిట్టి గుండె ఆగిపోతుంది అని ఆ పని చేయలేదు కానీ ఇదిగో ఇలా ఉత్తరం అయితే నువ్వు కోప్పడకపోతే ముందుకు వస్త లేదంటే అలాగే వెనెక్కి పారిపోతా పైగా ఇది పాకెట్ ఫ్రెండ్లీ  కూడా…ఎలా అని ఆలోచిస్తున్నావు కదా నాకు తెల్సు నీ ఆవగింజంత బుర్రకి అదేం తెలుస్తుందిలే గాని నేనే చెప్తా విను.. ఫోన్ చేసిన అనుకో వాడు రూపాయి అడుగుతాడు నీతో మాట్లాడిన అనుకో కోట్లు విలువ చేసే ప్రాణం పోతుంది అదే ఇది అనుకో రూపాయికి నాలుగు టావులు ఇస్తాడు నేను రాయల్సింది అంతా రాసి మా ఇంటి ముందు ఓ రాయి కి చుట్టి నీ డిప్ప మీదకు విసిరితే నువ్వే చదువుతావు కదా అల అన్నమాట సరే ఇంక మాటర్ లోకి వస్తా

వారం రోజులు గా ఒకటే వాంతులు విరోచనాలు
తెల్లవార్లూ ఒకటే బయపడి పక్క తడిపేయడాలు
ఎందుకా అని ఆలోచిస్తే నా బుర్ర ట్యూబ్ లైట్ గా మినుక్ మినుక్ అని వెలిగి ఆ వెళ్తుర్లో నీ మొహం కనపడింది

అవును నిన్ను మొదటి సారి చూసినప్పటి నుండి ఇలాగా అవుతుంది అని కనిపెట్టేసా

ఒకరోజు పొద్దున మా అమ్మ నన్ను కొట్టి కొట్టి వీపు తోముతుంటే ఆ దెబ్బల తాకిడికి గడియారం లోని లోలాకం అటు ఇటు ఊగినట్టు నేను కిందకి పైకి తల ఊపుతుంటే సరిగ్గా అప్పుడే నువ్వు కూడా లంగా ఎగ్గట్టి బర్రె ను తోముతున్నావు అప్పుడే చూసి పడిపోయిన మల్ల మేడ మీద పల్లు తోముతుంటే నువ్వు నీ ఎలక తోకంత పిలకకు బానేడు నూనె అంటుకుంటే మళ్లీ చూసా అప్పడినుంచే ఈ వాంతులు విరోచనాలు

నీ పేడ పిడకంత కళ్ళు

అవి చూస్తుంటే గగుర్పొడుస్తుంది నా ఒళ్లు

పాత చీపురు కట్టలాంటి నీ జడ

అది చూస్తే చాలు ఆగిపోవు గుండె దడ

గాడిద వోంద్రపెట్టినట్టు ఉండే నీ స్వరం

అది విన్నాక నేను మర్చిపోత గతం

నిన్ను చూసినప్పటినుంచీ ఒకటే ప్రాసలు

అవి విని నా వీపు పై ఒకటే వాతలు

ఈ వాంతులు విరోచనాలు వాతలు అన్ని ప్రేమకు గుర్తులు అని గట్టిగా ఫిక్స్ అయ్యా…..

అదేంటి కలలు చిలిపి చేష్టలు కదా ప్రేమ చిహ్నాలు అనుకుంటున్నావా అవన్నీ మనకు కాదెహే సినిమాలో హీరో హీరోయిన్ కి

ఆళ్లకు మనకు దూడ్పెడ కి దొడ్లో పేడ కి ఉన్నంత తేడా ఉంధి

ఆళ్ళ జంట ముగ్గు గొబ్బెమ్మ లాంటిది అయితే

మన జంట పేడ , పేడ పురుగు లాంటిది…

ఇదిగో నా ఫీలింగ్స్ అన్ని రాసి పంపుతున్న మొత్తం సదివి నచ్చితే సుబ్బాయమ్మ కొట్టు దగ్గర రెండు రూపాయలకు టి తాగుతున్నాను వచ్చేయ్ వన్ బై టు చేసుకుందాం కంగారుపడకు బిల్లు నేనే కడతాలే….

ఇక ఉంటా మరి……

 

– అమూల్య మర్రి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *