ప్రియా

ప్రియా

నా స్నేహితురాలు…. ప్రియా…. చాలా మంచి అమ్మాయి.. చాలా బాగా చదువుతుంది తన 10వ తరగతి వరకు… తన జీవితం సంతోషంగా సాగుతుంది 10వ తరగతి పాస్ ఆయింది. పై చదువులు చదవడానికి వాళ్ల అమ్మానాన్నలు కూడా ఒప్పుకున్నారు కానీ వాళ్ళ మేనత్త ఆడపిల్లకి ఇంకా చదువు ఎందుకు అని వాళ్ల అమ్మానాన్నలతో మాట్లాడింది మా అబ్బాయ్ కి మీ అమ్మయికి పెళ్లి చేద్దాం అని చెప్పింది.

మా అబ్బాయ్ తాగుతూ ఊరు పైనా బలాదూర్ గా తిరుగుతున్నాడు వీళ్ళ ఇద్దరికీ పెళ్లి చేస్తే మారుతాడు అని చెప్తుంది అప్పుడు ప్రియా వాళ్ల నాన్న ఆలోచనలో పడతాడు మా అక్క వచ్చి అడుగుతుంది ఎప్పుడైనా చేసేదే కదా అప్పుడు ఆ విషయం ప్రియకి చెప్పాడు తండ్రి మాట కి విలువ ఇచ్చి ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకుంది

పెళ్లి తరువాత…. ఒక్క వారం బాగానే ఉన్నాడు ఆ అబ్బాయ్ వారం తరువాత మళ్ళీ తాగడం, తిరగడం ఇంటికి వచ్చి అమ్మాయిని కొట్టడం ఇలా జరుగుతూనే ఉన్నాయి. రెండు సంవత్సరం తరువాత ప్రియకి బాబు పుట్టాడు.. ప్రియా జీవితం మాత్రం వంటింటికే పరిమితం అయిపోయింది… ఆ అబ్బాయి ఎ పని చెయ్యడు ప్రియని ఏ పనికి వెళ్లానివ్వడు… ఆలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయ్..

ప్రియకి రెండవ సారి కూడా బాబు పుట్టాడు.. అప్పుడు ప్రియకి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయ్… ఆ అబ్బాయ్ వాళ్ళ అమ్మ వాళ్ళనుండి విడిపోయి వేరే కాపురం పెట్టాడు తనకి ఉన్న భూమిలో ఊరుకి దూరంగా ఇల్లు కట్టాడు (రేకుల ఇల్లు) దాని కోసం ఎకరం భూమిని అమ్మేశాడు వచ్చిన డబ్బులతో మద్యానికి బానిసగా మారిపోయాడు ఇంట్లో గొడవలు అత్తవాళ్లు వచ్చి ప్రియనే తిట్టేవారు.

అయినా ఓపికపట్టి తనకి సేవ చేసేది. ఇంట్లో వంట సమన్లు లేవు పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి ప్రియకి సమస్యలు ఎక్కువ అయ్యాయి. వాళ్ల ఆయనకి డబ్బులు కావాలి అని అడిగింది అప్పుడు డబ్బులు నేను తాగడానికే లేవు ఎక్కడి నుండి తేవాలి అని కొట్టేవాడు. తనకి ఎం చెయ్యాలో తెలియక వాళ్ల నాన్న దగ్గరనుండి ఒక లక్షా రూపాయలు తెచ్చి పిల్లల ఫీజులు కట్టేసింది..

మిగతా డబ్బులు వాళ్ళ ఆయనికి ఇచ్చి ఇంట్లోకి సమాన్లు తీసుకురండి వంట చేయాలి ఏమి లేవు అని చెప్పింది. ఆ అబ్బాయి డబ్బులు తీసుకొని వెళ్లి వారానికి సరిపడే సమానలు తెచ్చి ఇచ్చాడు మిగతా డబ్బులతో మద్యం తెచ్చుకున్నాడు… మిగతా డబ్బులు ఏవి అని అడిగింది ప్రియా…. నన్నే డబ్బులు అడుగుతావా అని మళ్ళీ కొట్టాడు.

అప్పుడు నేను ఇంకా భరించలేను అని వాళ్ల అత్తని పిలిచి మీ అబ్బాయి కొడుతున్నాడు అని చెప్పింది అప్పుడు ఆ అబ్బాయి నేను ఎం అనలేదు ఆమెనే నన్ను తిడుతుంది కట్టుకున్న మొగుణ్ణి ఆలా ఎవరైనా తిడతారా అని మాట మార్చేశాడు. అప్పుడు ప్రియా వాళ్ల అత్త, మా అబ్బాయిని చంపేయాలి అనుకుంటున్నావా అని ప్రియనే తిట్టారు..

అప్పుడు ప్రియా నేను ఉండలేను అని వాళ్ల పుట్టింటికి వెళ్లిపోయింది… ఆలా రెండు వారలు అక్కడే ఉంది. అప్పుడు ఇరుగు పొరుగు వారు మాటల యుద్ధం మొదలుపెట్టారు…… సంసారం అన్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఆలా అని భర్తని వదిలేసి వస్తారా అని తిట్టడం మొదలుపెట్టారు. ప్రియా వాళ్ల అమ్మ నాన్న లు కూడా తనకి సర్దిచెప్పి పంపించారు.

అయినా ఆ అబ్బాయి మద్యం తాగడం మాత్రం మానేయలేదు. ఇంకా ఎక్కువ చేశాడు ఉదయం లేచిన వెంటనే మద్యం లేనిదే ఉండేవాడు కాదు ఆలా ఉన్న భూమిని అమ్ముకుంటూ తాగేవాడు ప్రియకి ఇంట్లో సమానలు కి పిల్లల ఫీజులకి ఇబ్బందిగా ఉండేది అప్పుడే ఒక్క నిర్ణయం తీసుకుంది. తాను ఏదైనా పనికి వెళ్ళాలి అని ఆ విషయం వాళ్ల భర్త కి చెప్పింది తాను ఒప్పుకోలేదు…

అప్పుడు చేసేది ఏమి లేక మళ్ళీ వాళ్ల అత్తగారిని వాళ్ల అన్నలని పిలిపించి పరిస్థితి మొత్తం చెప్పింది…. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ల అన్నయ్యలు నువ్వు పనికి వెళ్ళవు… తనని వెళ్ళనీయవు ఇంట్లోకి డబ్బులు ఎలా వస్తాయ్ అని అన్నారు అయినా అతను వినలేదు.

అప్పుడు వీడు మన మాట వినడు అంటూ వెళ్లిపోయారు. ప్రియా ఇంట్లో పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. అప్పులు పెరుగుతున్నాయి. నేను ఏమైనా పర్వాలేదు నా పిల్లలు ఉపవాసం ఉంటున్నారు అని… పిల్లలు చదువుకునే స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరింది… తరువాత ఇంటికి వచ్చింది.

అప్పుడు తన భర్త చాలా కోపంతో ఉన్నాడు. నాకు నచ్చని పని చేస్తావా అని మళ్ళీ కొడతాడు. ఈసారి ప్రియా తిరగపడుతుంది. నువ్వు ఎం చేస్తావ్ మహా అయితే చంపేస్తావేమో చంపెయ్ అని ఎదురించింది… ఇలా ప్రతి రోజు రెండు సంవత్సరాలు ఆ స్కూల్ లో ఉద్యోగం చేస్తూ పిల్లలకి ఫీజులు కట్టుకుంటూ ఇంటి దగ్గర ఉన్న నాలుగు ఎకరాల పొలాన్ని చూసుకుంటూ జీవితం సాగిస్తుంది.

అలాంటి సమయంలో వాళ్ళ భర్తకు గుండె పొట్టు వచ్చింది.. అప్పుడు ప్రియా ఏమండి మీరు ప్రతి రోజు ఇంతలా తాగితే మీ ఆరోగ్యమే చెడిపోతుంది కదా అని చెప్పి హాస్పిటల్ కి తీసుకెళ్ళింది….. హాస్పిటల్లో వారం ఉన్నారు తరువాత ఇంటికి వచ్చాక తన భర్త ఎంత కొట్టినా తనకి స్నానం చేయించడం, తనకి సేవ చేయడం… మాత్రం మానేది కాదు. కొట్టినా తిట్టినా నా భార్తే కదా అని ఓపికతో ఉండేది ఆలా ఒక్కరోజు మళ్ళీ వాళ్ళ భర్త తాగడం మొదలుపెట్టాడు..

ప్రియా అతనిని చూసి చూడనట్టు ఉద్యగానికి వెళ్లిపోయింది. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ని…. పిలిపించి నాకు ఆరోగ్యం బాగాలేకున్నా… నన్ను చూసుకోకుండా ఉద్యోగానికి వెళ్ళింది నేను చచ్చిపోవాలని చూస్తుంది అమ్మ అని చెప్తాడు ప్రియా సాయంత్రం స్కూల్ నుండి వస్తుంది…. అప్పుడు వాళ్ళ అత్తగారు మా అబ్బాయి ని చంపేయాలని చూస్తున్నావా ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్తే ఏమైనా అయితే ఎవరిది బాధ్యత అని గొడవ పడుతుంది.

అప్పుడు ప్రియా నేను ఎం చెయ్యాలి మీ అబ్బాయి ఉదయం నుండి తాగుతూనే ఉంటున్నాడు అలాంటప్పుడు ఆరోగ్యం చెడిపోతుంది కదా మీరు అయినా చెప్పండి అని చెప్తుంది అప్పుడు వాళ్ళ అత్తమ్మ వాడు మగాడు తాగుతాడు ఏమైనా చేస్తాడు.. నువ్వు ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండు అని చెప్తుంది ఆలా చాలా పెద్ద గొడవ జరుగుతుంది. చేసేది ఏమి లేక ప్రియా ఉద్యోగం మానేసి ఇంట్లో ఉంటూ పొలం చూసుకుంటుంది.

కలం పట్టాల్సిన చేతులతో ఇప్పటికీ పొలం నాట్లు వేస్తుంది ఇంత ఓపిక ఎలా వచ్చింది ప్రియమ్మ నీకు..

ఇది నా స్నేహితురాలి నిజ జీవితం

– నరేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *