ప్రేరణ
ఉమ రమ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకే కాలేజీ లో ఇంటరు చదివారు..ఇంటర్ ఎగ్జామ్స్ రాసాక ఏం చేద్దామని ఇద్దరూ ఆలోచించుకున్నారు..డాక్టరు కోర్సు చేద్దామని నిర్ణయించుకుని ఎవరి ఇంట్లోవాళ్ళని వాళ్ళు అడిగి ఒప్పించుకున్నారు..ఇద్దరు కలిసి ఎమ్ బి బి యస్ కోచింగ్ తీసుకోవడానికి పట్నం వెళ్ళారు..
చాలా బాగా క్లాసులు వింటున్నారు..
ఒక రోజు ఏదో లెస్సన్ చెప్తూ డెడ్ బాడీని చూపించారుదాంతో కళ్ళు తిరిగిపడి పోయింది రమ..ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కొద్ది రోజులుతీసుకెళ్ళి మంచి ప్రేరణ కలిగించి మళ్ళీ తీసుకొచ్చి దించారు..ఈ లోగా ఇంటరు రిజల్ట్స్ వచ్చాయి రమకు తక్కువమార్కులే వచ్చాయి సెకండ్ క్లాసులో పాస్ అయింది
ఉమకేమెా ఎక్కువ మార్కులు ఫస్ట్ క్లాసులో పాసయింది..నేను చదవ లేనేమెా నాన్న తక్కువ మార్కులు వచ్చాయి కదా! అంది రమ..
లేదమ్మా! నువ్వు చదవగలవు నాకా నమ్మకం ఉంది. చదవమని ఎంకరేజ్ చేసాడు రమ నాన్న..
ఇంతలో ఎమ్ బి బి యస్ ఎంట్రన్స్ కూడా రాసేసారుఉమకు మంచి సీటు వచ్చింది..రమకు డబ్బులు ఎక్కువ కట్టే సీటు వచ్చింది..అయినా రమకు మంచి ప్రేరణ దొరికింది ఇంట్లో..ఉమకు మాత్రం అవసరమా ఆ చదువు పెళ్లి చేస్తే సరిఆ డబ్బుల్లో అయిపోతుందని ఇంట్లో అందరూ ఆలోచించి పెళ్లి చేసారు..
ఫలితం..
రమ గైనకాలజిస్ట్ డాక్టరయింది..ఉమ మాత్రం మామూలు గృహిణి అయింది..చూసారా? ప్రేరణ ఎంత మంచి పని చేయించిందో!
ప్రేరేపిస్తే మామూలుగా చదివే పిల్లలు కూడా ఎదైనాసాధించగలుగుతారు..
తల్లి తండ్రులారా పిల్లలను ప్రేరేపించండి..
-ఉమాదేవి ఎర్రం