ప్రేమో…./పిచ్చో….మూడవ భాగం

ప్రేమో../పిచ్చో..మూడవ భాగం

 

నాని శ్రీ తో ఇలా అన్నాడు…..
ఏం మాట్లాడుతున్నావు నీకు నాకు ప్రేమ ఏంటి నీ వయసెంత నా వయసేంత ఏం చదువుతున్నావు నువ్వు……అని

శ్రీ కి అదంత విన్నాక ఏమి అర్ధం కాలేదు…ఇలా మాట్లాడుతున్నాడేంటి…..అని అనుకుంది తిరిగి నాని ని ఇలా అడిగుంది అదేంటి ఇంతకు ముందు నువ్వే నన్ను ప్రేమిస్తున్న అన్నావు కదా అని నాని అప్పుడు ఇలా చెప్పాడు అప్పుడు ఏదో సరదాగా ఆటపట్టిద్దాం అని అన్నాను నువ్వు నిజం అనుకున్నావు అని……

శ్రీ ఏంటి ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నావా అని తిట్టింది నాని ని నానీ ఇదంత వద్దు గాని ఫ్రెండ్స్ లా ఉందాం అన్నాడు శ్రీ వద్దు నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అంది పోని బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు అలా కూడా వద్దు అని ఇంకా ఉంటా అని చెప్పేసింది తరవాత కొన్ని రోజులు కి శ్రీ దాని గురించి వదిలేసింది మర్చిపోయింది…… సంవత్సరం తరవాత శ్రీ తన అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లింది.

అప్పుడు అక్కడ ఒక ఫోటో దిగి స్టేటస్ లో పెట్టింది దాన్ని నాని చూసాడు బాగుంది అని మెసేజ్ పెట్టాడు అప్పుడు శ్రీ టాంక్యూ చెప్పింది ఎలా ఉన్నావ్ అని అడిగింది బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు అని అడిగాడు నాని తరవాత ప్రేమిస్తున్నావా నన్ను అని అడిగాడు శ్రీ ఇంతకు ముందు ప్రేమిస్తున్న అని చెప్పి ఇప్పుడు లేదు అంటే ఏమైనా అనుకుంటాడేమొ అని హా ప్రేమిస్తున్నాను అంది తరవాత నాని గురించి అడిగింది నాని బెంగళూరులో జాబ్ చేస్తాడంట శ్రీ ఓ అవునా సరే అని ఇంకా ఏమి అడగలేదు అలా మాట్లాడుకుంటూ రెండు రోజులు గడిచిపోయింది…..

ఒకరోజు శ్రీ కి ఇలా అనిపించింది నేను నానీ ని నిజంగా ప్రేమించడం లేదు ఇది ప్రేమ కాదు నాని ఆరోజు ఎం అనుకుంటాడా అని ఓకే చెప్పాను అంతే కాని నాకు ఇష్టం లేదు అని అనుకుంది ఇలా చెయ్యకూడదు అనుకుని నాని కి చెపుదాం అనుకుంది కాని ఇలా చెప్తే వినడేమొ ఏదో ఒకటి సర్ది చెప్తాడేమో అనుకుని ఇలా చెప్పింది శ్రీ నాని కి ఆరోజు..

నన్ను క్షమించు నాని నాకు ఇంతకు ముందే ఒక లవర్ ఉన్నాడు మా ఇద్దరికి గొడవ అయింది. తన మీద కోపం తో నీకు ప్రపోజ్ చేసాను. మేము ఎన్ని గొడవలు అయినా మల్లి కలిసిపోతాము తనంటే నాకు ఇష్టం అని చెప్పింది నాని అదంతా విని సరే ఓకే నీ ఇష్టం block చెయ్యనా అయితే నిన్ను అని చివసారిగా అడిగాడు శ్రీ హా సరే చేసే అండీ నాని శ్రీ ని block చేసాడు..

తరవాత కొన్ని రోజులు గడిచిన తరవాత శ్రీ కి మల్లి ఇలా అనిపించింది తప్పు చేసానా అలా మాట్లాడుతూ ఉంటే ప్రేమ పుట్టేదేమో అని నాని కి ఒకదారి కాల్ చేద్దాం అని చేసింది నాని ఇలా అన్నాడు ఎందుకు కాల్ చేసావ్ అని శ్రీ జరిగింది చెప్పబోతుంటే నాని కలిసిపోయారా మీరు ఎం అంటున్నాడు మీ లవర్ అని అడిగాడు శ్రీ అదేం లేదు అప్పుడు అని చెప్తుంటే నాని ఆపు ఫీలింగ్స్ తో ఆడుకుంటావు నువ్వు మోసం చేస్తావు అలాంటి దానివి అని ఇష్టం వచ్చినట్టు తిట్టి కాల్ కట్ చేసాడు.

శ్రీ బాధ పడింది కాని నాని అలా తిట్టినందుకు కోపం వచ్చింది ఇంకా మాట్లాడకూడదు అనుకుంది. .కాని రెండు రోజులకి శ్రీ మల్లి నాని కి కాల్ చేసింది నాని మల్లి నీ లవర్ ఎం అంటున్నాడు అని అడిగాడు శ్రీ వదిలేసాడు నన్ను అనిచెప్పింది నాని సరే ఇంకా నాకు కాల్ చెయ్యకు అన్నాడు నాని ఇంతకు ముందు ఒకసారి చెప్పాడు శ్రీ కి నాని గతం లో ఒక అమ్మాయి ఉంది మోసం చేసింది అని అది గుర్తొచ్చి శ్రీ ఇలా అంది నాని తో.. 

– రమ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *