ప్రేమికుడు

ప్రేమికుడు

మధు టిఫిన్ పెట్టు ఆఫీస్ కి టైం అవుతుంది.. వస్తున్న రిషి అని టిఫిన్ పెట్టి పిల్లల్ని రెడీ చేసి రిషిని పిల్లల్ని కార్ వరకు వెళ్లి బాయ్ చెప్పి వస్తుంది.. ఇంట్లోకి రాగానే మొబైల్ లో ఏదో మెసేజ్ వచ్చినట్లు సౌండ్ రాగానే వెళ్లి చూస్తుంది.. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ ఎవరబ్బా అని ఓపెన్ చేయగానే ఒక సాంగ్ లిరిక్ రాసి ఉంటుంది..

నీవే తొలి ప్రణయము నీవే..

తేలి మనసున నీవే..

ప్రేమ జల్లువె…

నీవే …నీవే..

కలలు మొదలు నీవే..

మనసు కడలి అలలు నీవే..

కనులు తడుపు నీవే..

కలత చెరుపు నీవే..

చివరి మలుపు నీవే..

నీవే ఎటు కదిలిన నీవే..

నను వదిలిన నీవే..

ఏదో మాయ వే..

ఆ……………

ప్రేమే ..మది వెతికిన నీవే.

మనసు అడిగనతోడె నా జీవమే…

ఆ మెసేజ్ చూడగానే మధుకి నోటివెంట మాట రాదు కళ్ళలో నుండి నీళ్ళు అవి తన ప్రమేయం లేకుండానే ధారగా వస్తున్నాయి తన చేతిలో ఉన్న మొబైల్ టేబుల్ మీద పెట్టేసి మొబైల్ కి దూరంగా వెళ్ళి సోఫాలో కూర్చుంది… ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్లీ మొబైల్ వైబ్రేట్ మెసేజ్ వచ్చింది.. దగ్గరికి వెళ్లి మెసేజ్ ఓపెన్ చేద్దామంటే ధైర్యం సరిపోవడం లేదు చేతులు వణుకుతున్నాయి.. కానీ తనకు తెలియకుండానే తన అడుగులు మొబైల్ వైపు కదలసాగాయి, మెసేజ్ ఓపెన్ చేయగానే……

మధు ఎలా ఉన్నావు నేనెవరో గుర్తుపట్టావా..?

తన వెళ్లు తన ప్రమేయం లేకుండానే కీప్యాడ్ వైపుకు వెళ్లాయి.. శివ అని టైప్ చేసింది..

కొంతసేపు రెండువైపులా నిశ్శబ్దం..

మధు….

హాయ్ శివ నువ్వు ఎలా ఉన్నావు?

కనుమరుగైన నీ జ్ఞాపకాలలో గతాన్ని వెతుకుతూ బతుకుతున్నాను…

అంటే ఏంటి శివ నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా….

పెళ్లి…….. హహహ….. ఎలా అది నీకు నాకు ఎప్పుడో జరిగిపోయింది మొదటిసారి నీకు ప్రపోస్ చేశాను చూడు నువ్వు ఆక్సెప్ట్ చేసినప్పుడే… మనిద్దరికీ పెళ్లి చూపులు జరిగిపోయాయి… వాలెంటైన్స్ డే రోజు నువ్వు నాకు వాచ్ గిఫ్ట్ గా ఇచ్చావు ఆ రోజే మన ఎంగేజ్మెంట్, జరిగిపోయింది. నీ చెయ్యి పట్టుకుని నీతో అడుగులు వేసినప్పుడు పాణిగ్రహణం, సప్తపతి, అయిపోయింది..

నీకు ఒక ముత్యాల హారం గిఫ్ట్ గా ఇచ్చి నీ మెడలో వేసా చూడు అది తాళి అప్పుడే నీతో నాకు పెళ్లి అయిపోయింది.. మనిషి జీవితంలో ఒకేసారి పెళ్లి చేసుకుంటాడు అది నా దృష్టిలో అయితే జరిగిపోయింది.. 

నువ్వు ఇలా మాట్లాడి నన్ను జీవితాంతం గిల్టీ ఫీలయ్యేలా చేస్తున్నావు.. అయినా నీకు తెలుసుగా నేను ఈ పెళ్లి ఏ పరిస్థితుల్లో చేసుకున్నానో…. నాన్న చచ్చిపోతాను నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోకపోతే అని పురుగుల మందు తాగాడు… హాస్పిటల్లో నాతో ప్రామిస్ చేయించుకున్నాడు ఈ విషయం నీకు కూడా చెప్పాను నువ్వు అప్పుడు సరే అని ఒప్పుకున్నావు కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు..

లేదు మధు నీకు నా వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు..

నువ్వు నన్ను ఇబ్బంది పెడతావ్ అని కలలో కూడా అనుకోలేదు నువ్వు ఏంటో నాకు తెలుసు ఇన్ని సంవత్సరాల తర్వాత నీ నుంచి మెసేజ్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది… కానీ విచిత్రం ఏంటి అంటే నువ్వు ఎందుకో ఈరోజు నాకు స్ట్రాంగ్ గా గుర్తుకు వచ్చావు… నీ నుంచి మెసేజ్ కూడా ఈరోజే వచ్చింది… నాకే ఆశ్చర్యంగా ఉంది నమ్మలేకపోతున్నాను…

కొన్ని కొన్ని అంతే మధు నమ్మాలని ఉన్నా నమ్మలేము… నమ్మనివ్వదు..

ప్రేమ అనే కలం తో..

అక్షరాలనే దున్ని..

నీ పేరునె విత్తనాలుగా చల్లి..

మనోఫలకంపై వ్యవసాయం చేస్తున్న..

అది జ్ఞాపకాలుగా మొలకెత్తుతుంటే..

నా ప్రతి ఆశ నిరుగా పోసి.

నీకై ప్రతి ఆలోచన..

సూర్యరశ్మి లా మారి వాటికి బలం అవుతుంటే..

జరగవని తెలిసిన ఆశల పందిరిలో ఆర్తిగా ఎదురుచూస్తున్నా…

ఇది నా నుంచి నీకు వచ్చే చివరి కవిత చివరి మెసేజ్ ఇంకా నిన్ను డిస్టర్బ్ చెయ్యను మధు.

శివ.. ఒరేయ్ ఏంటి పిచ్చి మాటలు చివరి మెసేజ్ ఏంటి..

ఒరేయ్ ఈ పిలుపు చాలా బాగుంది మధు ఎన్ని రోజులు అవుతుంది ఈ పిలుపు నీ నుండి విని ఇంక సెలవు..

శివ ..శివ.. అని మధు ఇంకా ఎన్ని మెసేజ్లు చేసినా రిప్లై రాదు..

మధు కంగారుపడి శివ ఫ్రెండ్ ప్రవీణ్ కి కాల్ చేస్తుంది.

హలో ప్రవీణ్..

హలో మధు ఎలా ఉన్నావు..

ప్రవీణ్ శివ ఎక్కడున్నాడు నాకు మెసేజ్ చేశాడు ఇన్ని సంవత్సరాల తర్వాత.. వాడు ఇంకా పెళ్లి చేసుకోలేదా ఎలా ఉన్నాడు ప్లీజ్ ప్రవీణ్ ఒకసారి తనని కలవాలి తనతో మాట్లాడాలి కన్విన్స్ చేసి తను కొత్త లైఫ్ లిడ్ చేసేలా చేయాలి నేను చెప్తే తప్పకుండా వింటాడు ప్లీజ్ ఒకసారి తన దగ్గరికి తీసుకు వెళ్ళు..

మధు ఏం మాట్లాడుతున్నావు నీకు పిచ్చి పట్టిందా శివ నీకు మెసేజ్ చేయడం ఏంటి..

అవును ప్రవీణ్ ఇప్పుడే మెసేజ్ చేశాడు..

మధు షటప్ తిక్కతిక్కగా మాట్లాడకు చచ్చిపోయిన వాడు నీకు ఎలా మెసేజ్ చేస్తాడు..

ప్రవీణ్ నోర్ముయ్ ఏం మాట్లాడుతున్నావ్ శివ చచ్చిపోవడం ఏంటి..

అవును వాడి చచ్చి పది సంవత్సరాలు అవుతుంది అది నీకు కూడా తెలుసు..

ప్రవీణ్ ఇంకొకసారి అలా మాట్లాడకు.. శివ చచ్చి పోవడం ఏంటి అది నాకు తెలియడం ఏంటి.. నువ్వు నమ్మినా నమ్మకున్నా నాకు ఇప్పుడే మెసేజ్ చేసాడు అది మాత్రం నిజం..

సరే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావ్..

ఇంట్లో..

ప్రవీణ్ మధు హస్బెండ్ రిషిని తీసుకుని జరిగిందంతా చెప్పి రిషితో ఇంటికి వచ్చి… రీషిని బయటే ఉండమని ప్రవీణ్ లోపలికి వెళ్తాడు..

మధు ఏమైంది నీకు ఆర్ యు ఓకే..

ఐ యాం ఓకే శివ చనిపోవడం ఏంటి ప్రవీణ్ అబద్ధం ఎందుకు చెప్తున్నావు..

నేను అబద్ధం చెప్పడం ఏంటి..

అయితే శివ ఇప్పుడు నీకు మెసేజ్ చేశాడు అంటావు అంతేనా.

అవును..

అయితే నీ మొబైల్ ఇవ్వు నేను చూస్తా.

ఇదిగో చూడు అనగానే ప్రవీణ్ వాట్సాప్ మొత్తం చెక్ చేస్తాడు మధు చెప్పిన మెసేజెస్ ఏమీ ఉండవు.

మధు ఏవి నువ్వు చెప్పిన మెసేజ్లు అటువంటివి ఎమీ లేవు..

అదేంటి నేను ఇప్పుడే గా చూసింది లేవు అంటావ్ అని మొత్తం వాట్స్అప్ చాట్ చెక్ చేస్తుంది మధు..

నన్ను నమ్ము ప్రవీణ్ నిజంగానే శివ మెసేజ్ చేశాడు..

ప్రవీణ్ కి మధు సిచువేషన్ అర్థమవుతుంది రీషితో మాట్లాడి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకు వెళ్తారు మధుని..

డాక్టర్ చెక్ చేసి ఈ అమ్మాయి డిప్రెషన్లో ఉంది తన వల్ల అబ్బాయి చనిపోయాడు అని తనే దీనికి కారణమని బతుకుతుంది… ప్రతిరోజు దీని గురించి ఆలోచించి ఆలోచించి ఇలా అయిపోయింది.. తను ఇలాగే గనుక ఉంటే పూర్తిగా డిప్రెషన్లో పడిపోయి మీకు దక్కదు తనకి తోడుగా సపోర్ట్ గా ఉండి తనని బయటపడేలా చేయాలి

కౌన్సిలింగ్ ఇప్పించండి అని చెప్తాడు డాక్టర్ రిషి కి..

రిషి ప్లీజ్ తనని జాగ్రత్తగా చూసుకో అది జరిగిపోయిన గతం.. శివ సూసైడ్ చేసుకోలేదు.. మధు కి పెళ్లి అయిపోయింది అని డిప్రెషన్ లో ఉండిపోయి.. డ్రగ్స్ కి మందుకి అడిక్ట్ అయిపోయాడు.. ఒకరోజు బైక్ పై వస్తూ ఉంటే ఎదురుగా లారీ గుద్దేసి చనిపోయాడు… ఈ విషయం మధు కూడా తెలుసు.. శివ చనిపోయాడని అది కూడా తన వల్లే చనిపోయాడు అనుకొని మధు ఇలా అయిపోతుందని నెను ఎక్స్పెక్ట్ చేయలేదు.. అది జరిగిపోయిన గతం తనకి పాత ప్రేమ ఉంది అని తనని ఇబ్బంది పెట్టకు ప్లీజ్.. రిషి తనని అర్థం చేసుకో సపోర్టింగ్ గా ఉండు..

ప్రవీణ్ తను నా భార్య ఎప్పుడో జరిగిన దాని గురించి ఆలోచించి తనను హింసించే అంత మూర్ఖుని కాదు..

నా పెళ్లి అయ్యి పది సంవత్సరాలు అవుతుంది ఏ రోజు నాకు ఈ విషయం చెప్పలేదు అలాగని నన్ను నెగ్లెట్ కూడా చేయలేదు… నన్ను నా ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంది.. బట్ నాకు ఒక బాధ మిగిలిపోయింది మధు ప్రేమించినంత గొప్ప ప్రేమికుడు నేను ఎప్పటికీ కాలేను..

శివ ప్రేమ అమరం మరణించి కూడా తన ప్రేమను బతికించు కున్నాడు హీ ఈజ్ గ్రేట్.. “” కన్నయ్య””

– భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *