ప్రేమతో….
తనకోసం నేను రాసిన ప్రేమ లేఖలలో… నేను ఎప్పటికీ తనకి చెరవేయలేని.. మధురమైన లేఖ ఇది….
ఏవండోయ్…. మీ పేరేమిటో నాకు తెలియదు కానీ చూడగానే నాకు మీరు నచ్చేశారు… కానీ మిమ్మల్ని కలుద్దాం అని అనుకునెలోపే మా కాలేజ్ బస్ వచ్చేసింది… అందుకనే మిమ్మల్ని కలవలేకపోయా… కానీ ఆ రోజు నుండి మీకోసం చాలా చోట్ల వెతికాను. కానీ ఎక్కడా మీ ఆచూకీ లభ్యం కాలేదు…. కానీ కిందటి సారి నేను మిమ్మల్ని మా ఫ్రెండ్ పెళ్లి లో చూసా…
ఆ రోజు నుంచి నేను మిమ్మల్ని గమనిస్తూ ఉండేదాన్ని… తరువాత మా నాన్న గారికి వేరే ఊరు బదిలీ అవ్వడం వలన మేము అక్కడకి వెళ్లిపోవడం జరిగింది… అక్కడకి వెళ్ళాను అన్నమాటే కానీ మనసంతా ఇక్కడే ఉండేది…. అప్పటి నుండి ఇప్పటి వరకు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటున్న…. ఎప్పటికైనా నా మనసులో మాటని మీకు చెప్పాలి అని అనుకుంటున్నా…. కానీ ఎలా చెప్పాలి? మీరు ఎక్కడ ఉంటున్నరో తెలీదు.. ఇక చెప్పే రోజు రాకపోవచ్చు… కానీ ఒకటి మాత్రం చెప్పగలను.. మీరు ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేని అందమైన జ్ఞాపకం…..
– మేఘ