ప్రేమను పరీక్షిస్తే ఇంతే సంగతులు

ప్రేమను పరీక్షిస్తే ఇంతే సంగతులు

 

భర్తకోసం ఎదురుచూస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది సునీత. సునీతకు ఆరు నెలల క్రితమే పెళ్ళైంది. ఆమె భర్త పానకాలు(ఆవిడ పెట్టుకున్న పేరు) తను పనిచేసే ఆఫీసు నుండి సాయంత్రం సరాసరి బారుకు వెళ్ళిపోతాడు. ఆయన అసలు పేరు మల్లేష్. ఆయన తాగుడు చూసి సునీత అతనికి పానకాలు అని పేరు పెట్టుకుంది. పెళ్ళికి ముందుఅతనికి తాగుడు అలవాటుఉండేదని ఆమెకు తెలియదు.తెలిసి ఉంటే పెళ్ళి చేసుకునిఉండేది కాదు.

పెళ్ళైన రెండునెలల వరకు కుదురుగానేఉన్నాడు. ఆ తర్వాత మొదలుపెట్టాడు. రోజూ అర్ధరాత్రి వరకుతాగేసి ఇంటికి వచ్చేవాడు.అప్పటివరకు మెలుకువగాఉండి అతనికికావలసినవివండి వడ్డించేది. చివరకుఒక రోజు సునీత తన అమ్మకువిషయం చెప్పింది. పగలంతాచక్కగా ఉండే అల్లుడు ఇలాచేయటం ఆవిడకు బాధ కలిగింది. తన కూతురుకిఒక ఉపాయం చెప్పింది.

మరుసటి రోజు మల్లేష్రాకముందు గేటు తాళంవేసేసింది. ఇంట్లో చక్కగాపడుకుంది. అర్ధరాత్రి సమయంలో మల్లేష్ఇంటికి వచ్చాడు. గేటు తెరవమని అరిచాడు.
గేటు గట్టిగా కొట్టాడు. అయినాముందే వేసుకున్న ప్లాన్ ప్రకారంసునీత తలుపు తీయలేదు. గట్టిగా అరిస్తే పరువు పోతుందిఅని మెల్లగా గోడ ఎక్కి ఇంట్లోకివెళ్ళాలని చూసాడు. అప్పుడే
పోలీసు పెట్రోలింగ్ వ్యాన్ అటువచ్చింది. దొంగలాగా గోడ దూకిఇంట్లోకి వెళుతున్న మల్లేష్ నుఅదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్ తీసుకుని వెళ్ళారు.

రాత్రిఅంతా స్టేషన్లో ఉన్న మల్లేష్ తన భార్యకు అనేకసార్లు ఫోన్ చేసాడు. భర్త మీద ప్రేమ ఉన్నాఆమె ఫోన్ ఎత్తలేదు. అలా రాత్రి పోలీసులతో సావాసంచేసి తెల్లవారుజామున తెలివిలోకి వచ్చాడు మల్లేష్.తనెవరో వారితో చెప్పుకుని,పోలీసులను బతిమాలుకుని ఇంటికి వచ్చాడు. కుక్కిన పేనులా ఇంట్లోకి వచ్చాడు.ఆ రోజునుండి రాత్రి ఎనిమిదింటికే ఇంటికి
ఇంటికి వచ్చేయసాగాడు.

సునీత చాలా సంతోషించింది.తన తల్లికి ధన్యవాదాలు తెలిపింది. ఆమె నవ్వుతూ”మీ నాన్నగారు కూడా పెళ్ళైన కొత్తలో ఇలాగే కోతి చేష్టలుచేసేవారు. అప్పుడు నాఅమ్మ ఇదే ప్లాన్ చెప్పింది.ప్లాన్ అమలుపరిచాను .అంతే దెబ్బకి మీ నాన్నమారిపోయాడు” అంది.మొత్తానికి మంచే జరిగింది అని అమ్మా కూతుళ్ళు నవ్వుకున్నారు.

-వెంకట భానుప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *