ప్రేమంటే..
కనులు చూపే మధుర స్వప్నం ప్రేమంటే..
ఒకరు మాట, మరొకరు భావం కాదు..
మాటలకు అందని భావం ప్రేమంటే..
ఒకరు తప్పు, మరొకరు ఒప్పు కాదు..
ఒక్కటిగా కలిసుండే సర్దుబాటు ప్రేమంటే..
ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు..
ఒక్కటవ్వాలని అనుకునే మక్కువ ప్రేమంటే..
నువ్వు, మరొక నేను కాదు..
ఒక్కటయ్యే మనం ఈ ప్రేమంటే..
-భరద్వాజ్