ప్రేమలు పెళ్లిళ్లు

ప్రేమలు పెళ్లిళ్లు

 

“ప్రే” అంటె ప్రేరేపింపబడిన

“మ” అంటె మనసు

ఆడ మగల మనసుల

ప్రేరేపించు ప్రకృతి, సృష్టి చేయ

ఒకరి చూపులు మరొకరివి కలిపి

రెండు మనసుల,చేయు ప్రేరణ

అవే ” ప్రే ” “మ “అను ఇద్దరి

మనసుల కలుపు,రెండక్షరాలు

దూరమున వున్న ఆ రెండక్షరాలు

” ప్రేమ “గా మారె ఒకే మాటగ

పెళ్లిగ మారె ఏడడుగులు నడవ

జీవన పడవ నడచు ఒకే బాటగ,

ముందే జరిగే ఈ ప్రేమ పెళ్లిళ్ళు

స్వర్గాన ఎపుడో

తంతు మాత్రము జరుగు

భూలోకమందు

– రమణ బొమ్మకంటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *