ప్రేమలోకం
ఆకాశమే హద్దుగా
ఆంక్షాల అద్దులన్నీ
చెరిపేసి తీయని
ప్రేమలోకంలో
విహరిద్దామా నా చెలి…
ఏకాంతపు లోకంలో
తీయని భాషలెన్నో
చేసుకొని
ఊసలాడుకుందామా నా సఖియా…
అడుగడుగునా
ప్రేమపారవశ్యంతో
సాగిపోతూ
ఆస్వాదిద్దామా
అందమైన లోకాన్ని
ఓ ప్రియతమా…
చెట్ట పట్టాలేసుకొని
చిగురులు తొడిగిన
మన ప్రేమ మాధుర్యపు
సుమగందాన్ని
లోకమంతా పంచుదామా నా ప్రాణమా…
కడవరకు ఒకరికి
ఒకరమై ప్రేమంటే
మనమని గత చరిత్రకు
మన పవిత్ర అందాన్ని
ఆదర్శంగా అందిద్దామా
నా ప్రియ సఖియా!
-కొత్త ప్రియాంక (భానుప్రియ)