ప్రేమ కోసం

ప్రేమ కోసం

లత చురుకైన అమ్మాయి.ఆమె ఒక కాలేజీలో చదువుతూ ఉంది. ఈ మధ్య లత ఆందోళన చెందుతోంది.అసలేమి జరిగిందంటే లత కాలేజీకి కల్చరల్ సెక్రటరీ.

కాలేజీ వార్షికోత్సవం ప్లాన్చేసారు కాలేజీ యాజమాన్యం.అయితే ఆ వార్షికోత్సవాన్నినిర్వహించే బాధ్యత ఆమెపైపడింది. పాటలు, డాన్సులుఇంకా ఎన్నో సాంస్కృతికకార్యక్రమాలు చేయాలనిఅనుకున్నారు.

ముఖ్యఅతిధిగా ఆ రాష్టంలోనేప్రముఖ క్లాసికల్ డాన్సర్వస్తున్నారు. అందుకే ఒకమంచి క్లాసికల్ డాన్స్ ప్లాన్చేసారు. అయితే అదికృష్ణుని నృత్య రూపకం.అందులో గోపికలు,కృష్ణపాత్రధారులు ఉండాలి.

ఆ పాత్రధారులకు నృత్యంతెలిసి ఉండాలి. గోపికలపాత్రలు చెయ్యటానికిఅమ్మాయిలు సిద్ధంగాఉన్నారు. కృష్ణుని పాత్రవెయ్యటానికి కొందరుకుర్రాళ్ళు ఉన్నారు కానీవారికి నృత్యం రాదు.

అప్పుడు లతకు ఒకవిషయం గుర్తుకు వచ్చింది.హరి ఆమె ప్రేమికుడు. అదేకాలేజీలో చదువుతూ ఉన్నాడు.

ఎప్పుడో మాటల సంధర్భంలో తనకు నాట్యం వచ్చు అని చెప్పాడు. అతనుకృష్ణుని పాత్రకు సరిగ్గా సరిపోతాడు. అయితే అతనికిస్టేజ్ ఫియర్ ఉంది.

అప్పుడు లత తాను కూడా ఆ నృత్యకార్యక్రమంలో హరితో పాటుపాల్గొంటాను అని చెప్పి హరినిఆ కార్యక్రమంలో పాల్గొంటానికిఒప్పించింది.

అలా ఆమె తను బాగా ప్రేమించిన హరికి స్వయంగా గజ్జెలు కట్టి నృత్యకార్యక్రమంలో పాల్గొనేలా చేసింది. కార్యక్రమం చాలబాగా జరిగింది. వారిద్దరి మధ్యన ప్రేమ మరింత బల పడింది.

 

-వెంకట భానుప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *