ప్రేమైక జీవితం

ప్రేమైక జీవితం

*ప్రేమైక జీవితాన్ని గడపాలనే
అందరూ అనుకుంటూ ఉంటారు. అలాంటి ప్రేమమయమైన జీవితాన్ని
గడపాలంటే జీవిత భాగస్వామిని అర్ధం
చేసుకోవాలి. వారి
యొక్క ఇష్టాలు మరియు అయిష్టాలు తెలుసుకోవాలి.
తదనుగుణంగా జీవితాన్ని
గడపాలి.
* మనం తప్పు చేసినప్పుడు
క్షమించమని అడగాల్సిందే.
జీవిత భాగస్వామి కనుక తప్పుచేస్తే గనుక మనం
వారిని క్షమించాల్సిందే.
అప్పుడే జీవితం ప్రశాంతంగా
ఉంటుంది.
* ప్రేమ అనేది ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేది. ప్రేమను
ఇస్తేనే ప్రేమను పొందగలరు.
ద్వేషిస్తే కనుక ద్వేషమే
లభిస్తుందనే విషయం
గ్రహిస్తే మంచి జరుగుతుంది.

*ప్రేమలేని జీవితం ఉప్పులేని
పప్పులాగా ఉంటుంది.
జీవిత భాగస్వామి పట్ల ప్రేమను అప్పుడప్పుడు బహిర్గతం చేయాలి.
మనసులో ఉంచుకుంటే
లాభం లేదు.

 

-వెంకట భానుప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *