ప్రేమామృత

ప్రేమామృత

నీ ప్రేమామృత ధారలో తడిసి పోయి
ముద్దైన క్షణాన ఆ తలపుల నావ లో
నన్ను నీలో చూసుకున్న క్షణానా నీలో
నువ్వు, నాలో నేను అవే ప్రిమామృత ధారలు
ప్రవహిస్తుంటే, ఆ హృదయం ఉప్పొంగిన నిమిషాలు
కన్నుల నిండుగా కదలాడుతుంటే,
అందమైన అనుభవాల నీడల్లో అందుకున్న
ఆ అమృతపు ఘడియల్లో ఏ ఘడియకో
అమృతపు ధారను ఇచ్చిందో, యే మనోహర రూపం
నాలో నిదుర పోయిన ప్రేమామృత ధార
ప్రహిస్తున్నాయని తెలిసినప్పుడు కలిగిన
సంతోషం నన్ను నేను గర్వపడేలా చేసింది.
ఎన్నో యేళ్ళ నిరీక్షణ ఫలించిందనీ తెలిసిన
అమృతపు ఘడియల్లో జన్మించిన మూడో
తరాన్ని చూస్తున్నా నీ కళ్ళ లోని ఆనందాన్ని
అమ్మతనపు ఆకాశంలో సగాన్నై, ఆడజన్మకు
సార్థకతనై, పరిపూర్ణ మహిళమై, ఉప్పొంగిన
హృదయాన్ని, నాలో అమ్మతనపు గర్వాన్ని
ఆస్వాదించా క్షణాన్నీ…

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *