ప్రేమసరోవరం
ప్రేమెక్కడ దొరుకుతుంది
ప్రేమికులుగా ఉంటేనేనా!
ప్రేమంతా ప్రకృతిలో నిండి ఉంటుంది
చూసే కళ్ళను, వెతికే కాళ్ళను
నిదురించే మనసును జాగృతం చేయాలి
జాగ్రత్తలు చెప్పాలి
negetivity నిండిన జగతిలో positive
ఆలోచనలు వ్యాప్తి చేస్తే
ప్రేమసరోవరంలో ఈదులాడతాం
అప్పుడక్కడ వాదులాటలు కీచులాటలు ఉండవు !
-సి.యస్.రాంబాబు