ప్రేమలోకం
ఎప్పుడు లేస్తావో ఏమో కానీ మేము లెచేసరికి చక్కటి చిరు నవ్వుతో మా ముందు ఉంటావు. మేము రెఢీ అయ్యేంత లోపు మాకు కావాల్సినవి అన్ని సమకూర్చి పెడతావు.
అడగకుండానే అన్ని అమర్చి పెడతావ్, మాకు ఏదైనా కాస్త నలతగా ఉంటే కంగారు పడతావు. రాత్రి పగలు అని కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.
ఇక నాన్న ఇంటిని తన బాధ్యత గా స్వీకరించి సామాజికంగా ఆర్థికంగా ఇంట్లో వస్తువులని సమకూర్చి పెడుతూ, పిల్లల కు ఏ కష్టం రానివ్వకుండా కాపాడుతాడు. రక్షణగా నిలుస్తాడు.
నాన్న ఎవరికీ అంత తొందరగా అర్థం కాడు. కానీ నాన్న మనసు వెన్న , కాసేపు కొప్పడిన కూడా రాత్రికి బాధ పడేవాడు, అమ్మ ప్రేమ పైకి కనిపిస్తూ ఉంటుంది,కానీ నాన్న ప్రేమ మాత్రం చాప కింద నీరు లా ప్రవహిస్తుంది.
నాన్న తన జీవితాన్ని అంతా పిల్లల బాగు కోసం ధార పోస్తాడు. తన రక్త మాంసాలు కరిగి పోయేలా కష్టపడి, తన ఆశలు,కోరికలు అన్ని పక్కన పెట్టుకొని , తన జీవితాన్ని అంకితం చేసి పిల్లల కోసం పాటు పడే నాన్న ప్రేమ ఎవరికీ కనిపించదు.
వీళ్లిద్దరి తర్వాత అండగా నిలిచేది అన్న లేదా అక్క వారి సుఖాలను త్యాగం చేసి తమ కుటుంబం కోసం , చెల్లి,తమ్ముడి లక్ష్యం కోసం పాటు పడతారు.
ఇలాంటి అందమైన లోకం ప్రపంచం లో కుటుంబం అనే ప్రపంచం లో తప్ప మరెక్కడా దొరకదు.
అందుకే కుటుంబాన్ని ప్రేమించండి.కుటుంబాన్ని గౌరవించండి. కుటుంబం తో గడపండి, కుటుంబాన్ని అర్థం చేసుకోండి. మిమల్ని మీ కుటుంబం తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు అనేది తెలుసుకోండి..
-భవ్యచారు