ప్రేమ
నీళ్ళ బావి కాడ నాకోసం ఉండావు
బస్టాండు కాడ నాకోసం ఉండావు
ఆరోజు గుడికాడ ప్రసాదం కూడా ఇచ్చినావు
మొన్న కొట్లాటలో నా సెయ్యి పట్టుకున్నావు
పిల్లలతో ఆడుకుంటుంటే
నన్ను సూసి నవ్వినావు
గడ్డివాము కాడ గడ్డిమోపు ఎత్తనీకి పిల్చినావు
రెడ్డిగారి పొలంలో నాకు బువ్వ లేకుంటే నువ్వేగా పెట్టింది
సంతకు పోయినపుడు పెద్ద వానవొస్తే నువ్వేగాగొడుగు పెట్టింది
మా అమ్మకు ఒంట్లో బాలేదు అంటే నువ్వే సాయం సేసింది
ఏమో అవన్నీ నాకు తెలీదు
నువ్వు కావాలంతే
ఇదిగో ఇప్పుడు కూడా అటు తిరిగి నవ్వుతాండావు
ఈరోజు పిల్లని సూడనికి మీ ఇంటికి వచ్చినారంట సారాయి దాసప్ప సెప్పినాడులే
ఒరే నీ ఎదవ నన్ను సూసుకొనేకి కాదురా
మాయక్కను సూడనికి
– హనుమంత