ప్రేమ
అనసూయకు నలుగురు ఆడపిల్లలే! అయినా అతిగారాబంగా పద్దతి గా పెంచింది..అత్తగారి పోరు వల్ల నలుగురిని కనాల్సి వచ్చింది ఆమెకు వంశోద్దారకుడు కావాలని చాలా కోరిక కానీ
నలుగురు పిల్లలను కన్నా మగపిల్లడు పుట్టలేదు. దాంతో ఇక నా జాతకంలో మగ పిల్లాడు లేడు నేనిక కనలేనని గొడవ పెట్టి ఆపరేషన్ చేయించుకుంది..
లేకపోతె ఇంకెంత మంది పుట్టేవారో! అనుకుంటుంది రోజుకోసారి..కానీ ఆడపిల్లలయినా గారాబంగానే చూసుకుంటుందితల్లంటె ఇలా ఉండాలి అనుకునే వారందరూ అనసూయను చూసి..అందరు పిల్లల్లో మూడోపిల్ల సంధ్య మాత్రం తేడాగా ఉండేది..
ఎందుకో తెలియదు అమ్మ మీద కోపం పెంచుకుని పెరిగింది..వయసుకు వచ్చాక అమ్మ మాట వినకుండా ఎవరినోప్రేమించింది..తల్లి ఎంత చెప్తున్నా వినకుండా అతనితో లేచి పోయింది..తల్లి రాక్షసిలా కనిపించింది ప్రేమించిన వాడు దేవుడిలా కనిపించాడు..
కానీ కొంతకాలానికే సంధ్య మీద మెాజు తీరిపోయిందిసంధ్య తెచ్చిన డబ్బు నగలు అయిపోయాయి అందుకే వాడు విడిచి పెట్టి వెళ్లిపోయాడు..సంధ్యకు మతి చలించింది..
విషయం తెలుసుకున్న అనసూయ బిడ్డను తెచ్చుకుంది ట్రీట్ మెంట్ ఇప్పించి గుండెల్లో దాచుకుంది..మళ్లీ మామూలు మనిషిని చేసుకుని తనతోనె ఉంచుకుంది..అప్పుడు తెలిసింది సంధ్యకు అమ్మ ప్రేమ అమ్మ విలువ ప్రేమ విలువ..
లోకంలో అమ్మను మించిన ప్రేమ ఎవరికుంటుంది?ఇక తల్లిని విడిచి ఎక్కడికీ వెళ్లలేదు ..జీవితాంతం తల్లితోనె ఉండిపోయింది మగ పిల్లాడిలా!!
-ఉమాదేవి ఎర్రం