ప్రయాణం
ప్రయాణంలో వెళ్ళే దూరం కంటే జ్ఞాపకాల మధ్య వచ్చే అనుభూతులు ఎక్కువ ఉంటాయి.
బస్ జర్నీలో పక్కన్న ఉండే చిన్నపిల్లల్నుంచి పండు ముసలి వరకు ఎవరు ఉన్నా ఎదో ఒకటి మాట్లాడతాం… పిల్లలు అయితే ఆటలు ఆడుతూ మనమూ పిల్లల్లా మారిపోతాం… వాళ్ళ పేరు ఏంటో అడిగినప్పుడు వాళ్ళు చెప్పే ప్రతీ మాటా ఒక కొత్త బాషలా అనిపిస్తాయి… ఆ మాటలు తెలిసిన వాళ్ళ అమ్మ చెప్పే ఒక్కో మాటలో ముత్యాలు కనిపిస్తాయి…
కానీ ఇప్పుడు, బస్ ఎక్కామా, ఫోన్ లో చాట్ చేస్తూ, పాటలు వింటూ వెళ్ళిపోయామా అని ఉంటారు కానీ ఆ ఫోన్ పక్కన పెట్టె ప్రతీ నిమిషం ఒక సంఘటన కల్ల ముందు కనపడుతుంది.
బయటకి చూస్తె, ఊరిలో డబ్బా నుంచి, ఊరి చివర పొలాల వరకూ అన్నీ కనపడతాయి.. బస్ లోపల, చిన్న పిల్లలు, స్కూల్ కి వెళ్ళే పిల్లలు, మన తోటి వయసు కల అబ్బాయిలు, అమ్మాయిలూ, మాటలు చెప్పే పెద్దవాళ్ళు, మాయలు చేసే ఆటగాళ్ళు అందరూ అక్కడే ఉంటారు… పది నిమిషాల నీ జీవిత ప్రయాణంలో అన్ని చూసినా నువ్వు అరవై ఎల్లా జీవితంలో ఇంకా ఎన్నో చూస్తావు… అవి చూసాక నవ్వుతవావు ఏడుస్తావో పక్కన పెట్టేసి, ప్రస్తుతాన్ని ఆస్వాదించు మిత్రమా….
– జై
బాగా చెప్పారు