ప్రయాణం
ప్రతిరోజూ పయనమే
మరి జీవిత కాలం లో నిర్దేశాల ప్రకృతి నియమాలతో
మనకు పంచే లక్ష్యాలతో
మనసు వూగినా ఆగినా
గమ్యం వైపే నీ ఆశ
సూర్యుడు అస్తమించాడు
అని సేదతీరినా మళ్లీ
ఉదయాన్నే నీ ముందు
ప్రత్యక్షమవుతాడు
అలుపు సొలుపు లేకుండా
అందరికంటే ముందుగా
ఆలోచించడం నీ వంతు
పరుగెత్తే నీ శక్తికి
నీ అడుగుకు తోడు
దొరుకుతుందో చూడు
సాధ్యమైతే అందుకోవడానికి ప్రయాణం
ఆపకు అంటోంది
మది నిండుగా……?
– జి జయ