ప్రతీక్ష
నీ రాకకై మధురోహల
మాలలు సిద్ధంగా
చేసుకొని మదిలో నిండి ఉన్న
జ్ఞాపకాల గుబాలింపులతో
మనోగవాక్షాలను తెరచి
హృదయపానుపును పరచి
కరకమలాలతో కార్తీక
దీపాలను వెలిగించి
అంతరంగ మర్యాదలతో
ఆర్తిగా స్వాగతించడం కోసం
ఆశగా వేచిచూస్తున్న
ఈ అనామకురాలి
అంతరంగాన్ని
ఆనందడోలికల్లో
ఒలలాడిస్తూ
అరుదెoచుతావా
ఆత్మీయ నేస్తం!
– మామిడాల శైలజ