ప్రశ్నలు
మారని బతుకుల్లో
ఉషోదయాలుంటాయా
వీడని చిక్కుల్లో వేకువ గీతాలుంటాయా?
టక్కరి కాలం
అక్కర తీరుస్తుందా
ఆశల ఊపిరి అక్కున చేర్చుకుంటుందా?
ప్రశ్నల లోలకం
వాలకం మార్చుకుంటుందా
లోకులు కాకులై పొడవకుండా ఉంటారా?
ఆపద గడప
ఎక్కకా తప్పదు
నీడల జాడను వెతక్కా తప్పదు
జీవనకాంతులు
విరియాలంటే
ఓపిక తప్పదు
-సి.యస్.రాంబాబు