ప్రార్థన
ప్రార్థించే పెదవుల కన్నా
సహాయం చేసే చేతులు మిన్న అంటారు పెద్దలు .
ప్రాంతం ఏదైనా భాష ఏదైనా కుల మతాల కు
అతీతంగా ప్రార్థన ఉంటుంది . అదే భగవంతుని కరుణ కోసమే
దీనికంటే ముందు మనసుకు కళ్లెం వేయాలి
అప్పుడే మన ప్రార్థన
ఆరంభించాలి . అప్పుడు సులువవుతుంది
భగవత్ సాక్షాత్కారం లో
భక్తి రస బాటసారి గా
ఆర్ద్రత కనులతో
నిస్వార్థ భావనతో
శ్రద్ధాభక్తులతో
స్వచ్ఛ మైన వాక్కుతో
నిష్కల్మషమైన మనసుతో
చేసే ప్రార్థన సఫలం .
ప్రకృతిని ప్రార్థన చెయ్యాలి
శాంతి కోసం ప్రార్దించు
ఆనందం కోసం ప్రార్దన
మంచి మార్గం కోసం ప్రార్దన
అహాన్ని తగ్గించడానికి
మంచి వాక్కు కోసం ప్రార్థన
బలహీనతను అధిగమించడానికి ప్రార్థన
జ్ఞానార్జన కోసం ప్రార్దన
విశ్వాసం కోసం ప్రార్థన
ప్రపంచ శ్రేయస్సు కోసం ప్రార్దన చెయ్యాలి
ప్రయత్నాల ఫలం కోసం
ప్రార్థన నమ్మకంతో
అనునిత్యం చెయ్యాలి
పరమాత్మ అనుసంధాన
ప్రక్రియ కోసం
అదే అందరి ఆశావాద ప్రార్థన …..
– జి జయ