ప్రపంచం మిథ్య కాదు

ప్రపంచం మిథ్య కాదు

తనువును చాలిస్తే మరణం…
చిత్తాన్ని కొనసాగిస్తే జీవితం…
తెలియని ఆ రెంటి మధ్యన ఓలలాడే
ఆరాటాలెన్నో పాటుపడే పోరాటాలు
ఎన్నున్నా….
సుడిగుండాల లాంటి సుఖదుఃఖాలు
మాత్రం వచ్చిపోయే గూటిలోని గువ్వలే…

తెలియని వాటితో బాధపడకు
తెలిసిన వాదంతో సంతోషపడకు…
జగతికొలను ఒలకని నిండు కుండనే
అయినా…ప్రపంచం మిథ్యా కాదు…!!
నిలిచిన మానుగా…కాలం చెప్పిన కథలను
వింటూనే ఎన్నో ఋతువులను వసంతాల
వేడుకలకు ఆహ్వానమవుతుంది…

కట్టలు తెంచుకొన్నది కన్నీరై పారినా
వరదగా మనిషిని ముంచలేదు…
కలగన్నవి ఎన్నో ఉన్నా…
ఉన్నది ఒక్కటే జీవితం సంశయాలతో
తార్చుడువై మాటువేసిన పదునులతో
గుండెలను గుచ్చుతు…గూటిలోన
గువ్వలుగా ఒదిగిన కోరికలకు రెక్కలను
కట్టకు…

అన్వేషణా నిత్యం కూటి కోసమైతే
ఆరని మంటల ఆర్తనాధాలను వినలేవు
బతుకు సమ్మెట పోటులతో దగాపడుతున్న
క్షణాలతో…ఆరంభానికి ప్రారంభం కాలేక…
చితికిన మనస్సున చిత్రాలకు రంగులు
పూయలేక…చెదిరిన గూటితో విరిగిన
బంధాలు పూచిక పుల్లలై పొడుస్తాయి…

 

-దేరంగుల భైరవ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *