ప్రాణ నేస్తమా
జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులేన్నో
నా ఈ చిన్ని జీవితంలో ఎన్ని పరిచయాలు
ఉన్నా,
కలకాలం ఉండే తియ్యనీ స్నేహం నీది
కమ్మని మధుర భావ గీతి మనది
మరుపు రాని స్నేహ చిరునామా
మన ఇద్దరిదీ…!!
అందుకే నేస్తమా ఓ..నా ప్రియా ప్రాణ నేస్తమా…!
నా బాల్య చిరస్మరణీయ అపురూప అనురాగ ఆత్మీయ బంధమా
ఋణానుబంధమా ఆ దేవుడు కలిపినా,
చెలిమి ప్రేమనుబంధమా…
నా హృది లోగిలో సేద తీరే తీయని కమ్మని బంధమా మరువలేను నీ స్నేహం
మర్చిపోలేను నీతో నా ప్రయాణం…
ప్రతి క్షణం నీ చిరు నవ్వుల
స్నేహన్ని ఆశీస్తూ…
స్నేహమేరా జీవితం అని నాంది పలుకుతూ
స్నేహ అభయ హస్తం చాచి
స్నేహా బంధానికి ఆహ్వానం పలికి
నేస్తం నువ్వే అని చాటి చెప్పి..,
ఆనాటి హృదయాల ఆనంద గీతమై
ఆ… జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం
అని పాడుకుంటూ….
గడిచిన కాల స్మృతులు తలచుకుంటూ
సాఫిగా సాగిపోదాం…
జీవన మజిలీ హాయ్ గా సాగిద్దాం..!!
అందరికీ స్నేహితుల దినోత్సవ
శుభాకాంక్షలు…!!
-సైదాచారి మండోజు