ప్రకృతి ఒడిలో
ఈ అందమైన వెన్నెల రాత్రి
నేను నా ముద్దుల ప్రియుడితో
గడుపుతున్నా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ
అందమంటే జారే జలపాతాలు అనుకున్నా
అందమైన వికసించే పువ్వులు అనుకున్నా
నీ తియ్యని ప్రేమ కబుర్లును వినాలని
చంద్రుడి కిరణాలతో సరస్సు వెన్నెల జలపాతాల హోరు కనువిందు చేస్తున్నాయి…
ఈ వెన్నెల రాత్రి నీతో పాటు
ఇక్కడ ఉంటానని నేను అనుకోలేదు..
కొండ ,కొనల మధ్య ఉంటూ
పై నుండి కింది జారుతున్నా జలపాతాలను చూడడానికి
నా రెండు నయనాలు సరిపోవడం లేదు…
ఈ చల్లటి గాలి నన్ను పలకరిస్తుంటే
ఈ అందమైన అనుభావాన్ని వ్యక్తం చేయలేక
నాలో నేనే మదన పడుతూ
ఆకాశంలో తారలు మిలమిల మెరుస్తూ
అందమైన వెన్నెలతో ఎన్నో మాటలు చెప్పుకుంటూ
ఇలాంటి అందమైన ప్రకృతి అందాల నడుమ
నీతో ఉన్నందుకు
నేను ఈ రాత్రిని నీతో గడిపేస్తున్నాను…
ఈ ప్రకృతి ఒడిలో నేను సేద తీరుతూ
ఈరోజు ప్రకృతిలో మమేకమై నేను ఎన్నో కబుర్లు చెప్పుకొని నిద్రపోయాను…
– మాధవి కాళ్ల