ప్రకృతికి కోపం వస్తుంది
చెట్లను కరుణ లేకుండా కొట్టేస్తే,
నదుల నీటిని కలుషితం చేసేస్తే,
భూమాతను తవ్వి పడేస్తుంటే
ప్రకృతి ఆగ్రహంతో ఊగిపోదా.
పర్యావరణం నాశనం అవ్వదా.
వినాశనం మనమే చేస్తుంటే,
గాలిని కలుషితం చేస్తుంటే,
సమస్త ప్రాణికోటి అల్లాడదా.
పర్యావరణం నాశనం అవ్వదా.
అన్నీ తెలిసిన మనిషి కూడా
ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తే.
మారని మనిషిని క్షమించేసే
సహనం ప్రకృతికి ఉంటుందా.
-వెంకట భానుప్రసాద్ చలసాని