ప్రకృతి అందాలు – అవి నేర్పే పాఠాలు
ప్రకృతి పరిస్థితులకు పర్యాయ పదం.. ప్రకృతిని ప్రేమించడం అనేది మరో వరం..
మనిషి మనిషిని చూసి నేర్చుకునే పాఠాలు కన్నా….
ప్రకృతి నేర్పిన పాఠాలు కల్మషం లేని కాపాడే కవచాలు.. భారం ఎంతైనా భరించే శక్తి, సహనం నాకు ఉన్న గుణం అంటుంది అవని….
విశాల హృదయం, విహార యాత్ర పఠనం, ఆకాశయానం
నా నైజం అంటుంది గగనం… ప్రాణాన్ని పోసే పంచామృతంలా మారే కణం నేనే అంటుంది పవనం..
హోరెత్తి హుషారుగా కొండ చరియాల్లో, అలుపులేని గమ్య గదులకు చేరి దాహాన్ని తీర్చడం నా లక్షణం అని అంటుంది గల గల పారే గంగ…
చీకటిని తరిమి జీవజాతులకు వెలుగును నింపి, చీకటి రాత్రులకు దీపంలా మారి భయం లేని బాటసారి నేను అని అంటుంది చిరుజ్వలా అగ్ని….
ఇలా పంచ భూతాలు సైతం ప్రకృతి అందాలు మనకు నేర్పేను మంచి పాఠాలు…..
ఊరికే వృధాకాకు… అవసరానికి ఆదుకో… అని ప్రకృతిలో చెట్టు చేమ, గువ్వా, గూడు నేర్పేను మనకు పాఠాలు…..
– తోగారపు దేవి