ప్రజా గొంతుగా మూగబోయిన వేళ

ప్రజా గొంతుగా మూగబోయిన వేళ

ఈ ప్రజా గొంతుకు మూగబోయిన వేళ
ఆ పొడుస్తున్న పొద్దు, ఇక పూయని వేళ
నువ్వు పాట పాడితే ముసలి తాతకి కూడా

రోషం వచ్చి ఎగిరి గంతులు వేస్తాడు
అప్పుడే పుట్టిన పసిపిల్లలు కూడా నీ గొంతుక వింటే

తన ఏడుపుని ఆపి నీతో పాడాలని ప్రాధేయపడతాడు
సమాజ శ్రేయస్సు కోసం నువ్వు అల్లిన పాటలు అనేకం
నీ పాట వింటే చాలు ఆ ప్రకృతి కూడా పర్వశించి పోతుందో
జలపాతాలు సైతం పారధారలై ప్రవహిస్తాయి
ఆ గొంతుక మూగబోయిందని దుఃఖిస్తున్నది నేడు..!
నువ్వు ఉత్తేజపరిచే పాటగానం ఆవిరైన పోయింది
నీ స్వరం, నీ గర్జన ఇక పలకని వేళ
ప్రజా సంగ్రహం కోసం
భుజానికి వేసుకున్న గొంగడి..
చేతిలో పట్టుకున్న దండ…
మీగుండెల్లో దిగిన బుల్లెట్లు ఎన్నో….
అయినను నీ ప్రజా ఉద్యమం ఆపలేదు ఏనాడు
తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్య పరుస్తూ

నువ్వు గజ్జ కట్టి ఆడిన ప్రజా గర్జన సభలెన్నో
ఈ నేల తల్లికి ఎందరో కవులకు ప్రాణం పోసి
నీ ఆఖరి క్షణంలో కూడా నీ పాటనే తుది శ్వాస మారింది
మా మదిలో చెరుగని నీ పాటల జ్ఞాపకం ఎప్పటికీ మాతోనే ఉంటావు.

ప్రజా గద్దర్ అన్నకి ఘన నివాళులు అర్పిస్తూ…

 

-గురువర్ధన్ రెడ్డి

0 Replies to “ప్రజా గొంతుగా మూగబోయిన వేళ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *