ప్రహేళిక
ఆద్యంతాలు గోచరించని
అద్భుత యోగమాయలో
అనంత చరాచర సృష్టి
సముదాయంలో పిపీలికం
లాంటి చిరు జీవిని నేను!
కనురెప్ప మాటున కరిగిపోయే
ఈ జన్మను ఏం చేస్తే
నేను సార్ధకం చేసుకోగలను!
మరుభూమికి తరలిపోయేలాగా మరుజన్మ లేకుండా దీనిని
ఎలా సద్వినియోగం
చేసుకోగలను! బాహ్య
ప్రపంచపు భవభంధనాలను ఛేదించుకొని అలౌకిక
ఆనందాన్ని ఎలా పొందగలను?
అప్రమేయంగా ఆరుదెంచిన
నేను చివరిప్రస్థానం
సాగించేలోగా చిరస్థాయిగా
నిలిచే యశస్సును ఎలా
ఆవాహం చేసుకోగలను!
మది మదిని తొలచే
ఎదఎదను కలచివేసే
ఈ సందేహం ఎప్పటికీ
ఒక ప్రహేళిక నేనా?
-మామిడాల శైలజ