పౌరులు

పౌరులు

భావి పౌరులు భవిష్యత్తు బాలురు..

మీ సత్తివ మీకు తెలియదు..
కానీ కాలే కడుపులు…

కుటుంబ భారం మోయాల్సిoదే..

కష్టేఫలిగా పనిచేయాల్సిందే..
కానీ భవిష్యత్తు నష్టం జరిగిందే..
భారీ మూల్యం చెల్లించాలి…

బాలకార్మికులుగా కావడమే నేరం…
చట్టం దృష్టిలో వ్యతిరేకం..

తల్లిదండ్రులు దయ లేదా…

ముక్కుపచ్చలారని వయసులో చదువుసంధ్యలు లేక

గనిలో పనికి పంపించడమేనా…

పిల్లలు మీకు యంత్రాల…
వాళ్లకు మనసుంది చదవాలనే కోరిక ఉంది..
కానీ తల్లిదండ్రుల బాధల చూసి..

సంపాదన ధ్యేయంగా పనిబాటలు చేస్తున్నారు…
ప్రతిగా తల్లిదండ్రులకు సాయం చేస్తున్నారు..

దేవుడా పసిపిల్లల పాపం ఏంటి???
వాళ్ళ బ్రతుకులు నరకప్రాయమా…
భావి పౌరులు దేశ భవిష్యత్తుకు దిక్చూసి…

వీళ్లు కానీ కార్మికులుగా మిగిలిపోవాల్సిందేనా..

కన్నీటి కష్టాలు పడవలసిందేనా…

కొందరికి ఇలా రాత రాయడం బాగుందా…

వాళ్ల తలరాతని సర్దుకోవడంమా…

మారదు ఈ లోకం..

మనిషి బ్రతుకు మారదు ఈ లోకం..
చీకటి బ్రతుకుల చీల్చి వెలుగుల మయమే రాదా…
రావాలని ఆశిస్తాం…

బావి భవిష్యత్తు పౌరులుగా వెలుగొందాలని ఆశిస్తాం..

– పలుకూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *