పోటీ

పోటీ

 

 “దేవ్ మనం కలిసి ఫ్యామిలీతో బయటికి వెళ్లాలి. ఈరోజు పండు పుట్టిన రోజు వాడికి సప్రైజ్ చేయాలి” అని చెప్పాడు రాఘవ.
“సరే రా… కానీ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి అని అడిగితే చెప్పాలి కదా” అని అన్నాడు దేవ్.
“అందరికీ సీక్రెట్ గా చెప్పు , కానీ పండుకి మాత్రం తెలీదు, ముఖ్యంగా పిల్లలకి” అని చెప్పాడు రాఘవ.

“సరే… నువ్వు ఇక్కడ ఏర్పాట్లు చూడు ఇంట్లో వాళ్ళకి చెప్పేసి వస్తాను” అని చెప్పాడు దేవ్.“వాళ్ళకి చెప్పడమే కాదు ,వాళ్ళని తీసుకొని రావడం బాధ్యత నీదే “అని చెప్పాడు రాఘవ.

ఇంక నువ్వేం చెప్పనవసరం లేదు… అంత అర్థం అయిపోయింది నేను వెళ్లి వాళ్ళని తీసుకొస్తాను సరేనా” అని చెప్పి వెళ్ళిపోయాడు దేవ్.

ఇంటికి వెళ్లి జయ ,తులసిలకు విషయం చెప్పి రెడీ అవ్వమని చెప్పి తాను పిల్లలను రెడీ చేస్తాడు దేవ్ దేవు రాఘవ ఒకే కంపెనీలో పని చేయడం వల్ల మంచి స్నేహితులయ్యారు. అలాగే వాళ్ళ కుటుంబాలతో ఇంకా సానిహిత్యం ఏర్పడింది.
అలా ఇరువురి వాళ్ళ ఇరువురి మమతానుబంధంగా మెలుగుతూ ఉండేవారు.

రాఘవకి అమ్మాయి అబ్బాయి , దేవ్ కి ఇద్దరు అబ్బాయిలు.తులసికి మాత్రం అమ్మాయిలు అంటే చాలా ఇష్టం.
రాఘవ కూతుర్ని చాలా చక్కగా చూసుకునేది.

వీళ్ళందరూ రెడీ అయి సరికి గంట పట్టింది.సరే పదండి వెళదాం అని కారులో తీసుకెళ్లి హోటల్ దగ్గర ఆపాడు దేవ్.
“అదేంటి మావయ్య ఇక్కడికి తీసుకొచ్చారు?” అని అడిగింది దియా.

” చెప్తానమ్మా నువ్వు ఫస్ట్ పద” అని చెప్పాడు దేవ్.“ఆ వచ్చేసారా వచ్చి కూర్చోండి” అని చెప్పాడు రాఘవ.
బేరర్ అని పిలిచాడు రాఘవ.

 

“సార్ మీరు చెప్పినవన్నీ రెడీ ఇప్పుడే తీసుకొస్తాను” అని చెప్పి లోపలికి వెళ్ళాడు బేరర్.“పండు ఈరోజు నీ డ్రెస్ చాలా బాగుంది” అని చెప్పాడు రాఘవ.మావయ్య తీసుకొచ్చాడు నాన్న” అని చెప్పాడు పండు.
“అబ్బో అవునా…” అని నవ్వుతూ అన్నాడు రాఘవ.

బేరర్ కేక్  ,క్యాండిల్స్ అన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు.పండుని కేక్ ముందు నిలబెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు పండు అని చెప్పాడు రాఘవ.

అందరూ పుట్టినరోజు పాట పాడి విషెస్ చెప్పారు.హాయిగా ఎంజాయ్ చేసి మధ్యాహ్నం అక్కడే లంచ్ చేసి ఇంటికి వెళ్లిపోయారు. “ఈరోజు నైట్ పార్టీ ఉంది. నేను వెళ్తాను అమ్మ” అని అడిగింది దియా“నువ్వు ఎక్కడికి ఒంటరిగా వెళ్ళనవసరం లేదు?” అని చెప్పింది జయ.

“ప్లీజ్ అమ్మ… ప్లీజ్…” అని దియా బతిమిలాడుతుంటే“సరే ఒక గంటలో వచ్చేయాలి కానీ నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి వీలు లేదు. నీతో పాటు ఆదిని తీసుకొని వెళ్ళు” అని చెప్పింది జయ.“సరే అమ్మ… కానీ ఆది తో నేను మాట్లాడను. నువ్వే ఆదికి చెప్పు” అని చెప్పింది దియా.

తులసి వాళ్ళ ఇంటికెళ్లి ఆదిని పిలిచింది జయ.“ఏంటి అత్తయ్య పిలిచారు?” అని అడిగాడు ఆది.“దియా ఏదో పార్టీకి వెళ్లాలంటే తనకి నువ్వు తోడుగా వెళ్ళు , నీకు ఇప్పుడు ఏమైనా పని ఉందా?” అని అడిగింది జయ.
“నేను కూడా ఆ పార్టీకే బయలుదేరుతున్నాడు అత్తయ్య.

కానీ దియా నాతో మాట్లాడదు కదా అడిగితే ఎక్కడ గొడవ పడుతుందో అని అడగలేదు”అని చెప్పాడు ఆది.“మీరు వెళ్లి త్వరగా వచ్చేయండి. బయట తను రెడీ గానే ఉంది” అని చెప్పింది జయ.సరే అత్తయ్య అని చెప్పి బయటికి వెళ్లిపోయాడు ఆది.

జయ , తులసి లు కలిసి సీరియల్స్ చూస్తున్నారు.అప్పుడే రాఘవ , దేవ్ లు“ఏంటి ఇల్లు సైలెంట్ గా ఉంది. పిల్లలు లేరా?” అని అడిగాడు రాఘవ.“తేజ్  ,పండు లు ఉన్నారు. ఆది ,దియా లు  పార్టీకి వెళ్లారు” అని చెప్పింది జయ.
“ఈ టైంలో పార్టీ ఏంటి?” అని అడిగాడు దేవ్.

ఫ్రెండ్స్ పార్టీ అంట” అని చెప్పింది తులసి.“సరే… మీ సీరియల్స్ అయిపోతే మాకు అన్నం పెట్టండి. నేను ఇంటికి వెళ్లి ఫ్రెష్ అవుతాను” అని చెప్పి వెళ్లిపోయాడు రాఘవ.“సరే… నేను వస్తాను మీ వెళ్ళండి” అని చెప్పింది జయ.
ఒకరోజు ఆఫీస్ కి వెళ్లిన తర్వాత ఆఫీస్ లో బాస్ ఎవరి మీద అరుస్తున్నాడు.

ఏంటని అడిగితే ,“ఆఫీస్ లో ఉన్న డబ్బు ఎవరో దొంగలించారు” అని చెప్పాడు తనతో పాటు పని చేసే వంశీ.“అంత అమౌంట్ ఆఫీసులో పెట్టడమేంటి?” అని అడిగాడు దేవ్.“ఏదో అవసరం ఉంది కాబట్టే నిన్న తీసుకొచ్చి పెట్టారంట” అని చెప్పాడు వంశీ.

“అయితే ఇప్పుడు ఆ డబ్బు కొట్టేసిన వాళ్ళు ఎవరో తెలియదు , కానీ మన ఇంటిని పోలీసుల చేత సోదా చేయిస్తారు” అని చెప్పాడు వంశీ.“అవునా… దొంగలు పట్టుకోవాలంటే ఇలాంటి సోదాలు చేస్తే దొరుకుతారా?” అని అన్నాడు రాఘవ.
“ఏమోలే… కానీ అదిగో పోలీసులు వచ్చారు” అని చెప్పాడు దేవ్.

ఆఫీస్ లో ఉన్న అందరి ఇంటిని సోదా చేశారు.చివరికి మిగిలింది రాఘవ ,దేవ్ లా ఇంటిని సోదా చేస్తున్నారు.
రాఘవ ఇల్లు అయిపోయిన తర్వాత దేవ్ ఇంట్లో చేస్తున్నారు. ఇక్కడ బెడ్ కింద డబ్బులు దొరికాయి దేవ్ అరెస్ట్ చేశారు.

దేవ్ ఎంత చెప్పినా వినకుండా స్టేషన్ కి తీసుకెళ్ళిపోయారు. సాయంత్రం బెయిల్ మీద విడిపించాడు రాఘవ.
మావయ్య అని మీతో ఒక విషయం చెప్పాలి అని అడిగాడు ఆది.

“ఏంటో చెప్పు ఇక్కడ కాదు?” అని అడిగాడు రాఘవ.“ఇక్కడ కాదు మీతో పర్సనల్గా మాట్లాడాలి” అని అన్నాడు ఆది.
వాళ్ళ బాస్ ఇంటికి వచ్చి ,“నీకు వారం రోజులు గడువిస్తున్నారు. ఈ దొంగతనం చేసింది నువ్వే అని నా దగ్గర ఒప్పుకుంటే క్షమించు వదిలేస్తాను ,లేదంటే ఉద్యోగం పీకేస్తాను” అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు.

“నువ్వేం బాధపడకు రా. అన్ని నేను చూసుకుంటాను ఇది చేసినది ఎవరో నేనే తెలుసుకుంటాను” అని చెప్పాడు రాఘవ.
రోజులు గడిస్తున్నాయి.ఒక రోజు ఆఫీస్ కి ఎస్సై వచ్చాడు.వంశీకి ఏదో అనుమానం వచ్చి కిటికీ ఓపెన్ చేసి చూసాడు.
“సార్ మీరు అన్నట్టుగానే దేవ్ ని అరెస్టు చేశాం. కానీ రాఘవ మాత్రం బెయిల్ మీద విడిపించాడు మీరు వెళ్లి వార్నింగ్ ఇవ్వడం కూడా మంచిది అయింది” అని చెప్పాడు ఎస్సై.

“కానీ దేవ్ ఈ వారం రోజుల్లో తప్పు చేశాడని ఒప్పుకుంటాడా?” అని అడిగాడు ఎస్సై.“తప్పకుండా ఒప్పుకుంటాడు. ఎందుకంటే వాడికి కచ్చితంగా ఉద్యోగం కావాలి అందుకే కచ్చితంగా నా దగ్గర ఒప్పుకొని ఉద్యోగం చేస్తాడు” అని చెప్పాడు బాస్.

“మీరు డబ్బులు వాళ్ళ ఇంట్లో పెట్టడం ఏంటి ?”అని అడిగాడు ఎస్సై.“నేను ఇచ్చిన ప్రాజెక్ట్ కొన్ని రోజులు తర్వాత రాఘవ , దేవ్ లు పూర్తి చేసేసి ఒక సొంత కంపెనీ పెట్టాలని అనుకున్నారు.ఆ కంపెనీ నా కంపెనీకి పోటీ ఉంటుంది కాబట్టి ఇప్పుడే వాళ్లని ఇలా ఇరికించాను. కంపెనీ పెట్టకూడదు నా దగ్గరే ఉద్యోగం చేయాలి అని పగ పెంచుకున్నాను” అని చెప్పాడు బాస్.

‘ఇద అసలైన సంగతి వెంటనే ఈ విషయం రాఘవకి ఫోన్ చేసి చెప్పడానికి బయటకు వచ్చాడు వంశీ.’
కానీ రాఘవ ఫోన్ కలవడం లేదు.ఇంటికి వెళుతుండగా ఆది కనిపించాడు.ఆదికి విషయం మొత్తం చెప్పాడు వంశీ.
“లేదు అంకుల్… నాన్నని పోలీసులు కోర్టుకి తీసుకొని వెళ్లారు” అని చెప్పాడు ఆది.

అయితే నేను వీడియో కూడా తీశాను. ఆ వీడియో మనం కోర్టులో చూపిద్దాం పద అని ఆది , వంశీ లు కోర్టుకి బయలుదేరారు.కోర్టులో వీడియో చూపించి బాస్, ఎస్ ఐ లను అరెస్ట్ చేయించి , శిక్ష పడేలా చేశాడు వంశీ.

మేము కంపెనీ పెడితే ఎక్కడ మీకు కంపెనీకి పోటీ వస్తుందని పగ పెంచుకొని నన్ను ఇలా ఇరికించి నువ్వే ఇరుక్కుపోయావ్ అని చెప్పాడు రాఘవ.

అందరితో పోటీ ఉండాలి కానీ అది పగగా మార్చుకోకూడదు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు.మనిషి జీవితంలో పోటీ లేకపోతే ఎలా ఓటమి అనేది విజయానికి మెట్లు.ఆ ఓటమిని అవమానంగా భావించకూడదు.

 

 

-మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *